News January 2, 2025

‘తాటిపూడి రిజ‌ర్వాయ‌ర్‌కు గొర్రిపాటి పేరు పున‌రుద్ద‌ర‌ణ‌’

image

తాటిపూడి రిజ‌ర్వాయ‌ర్‌కు గొర్రిపాటి బుచ్చి అప్పారావు రిజ‌ర్వాయ‌ర్‌గా పేరును పున‌రుద్ద‌రిస్తూ ప్ర‌భుత్వం గురువారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. రిజ‌ర్వాయ‌ర్‌కు గొర్రిపాటి పేరును పున‌రుద్ద‌రించాల‌ని ఎస్‌.కోట ఎంఎల్ఏ కోళ్ల ల‌లిత‌కుమారి కూడా మంత్రికి విజ్ఞ‌ప్తి చేశారు. దీంతో ఈ అంశాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొని చేసిన కృషి ఫ‌లితంగా పేరు పున‌రుద్ద‌ర‌ణ జ‌రిగిందని అధికారులు ప్రకటించారు.

Similar News

News January 6, 2025

విజయనగరం: రైల్వే కరెంట్ వైర్లు తగిలి వ్యక్తి మృతి

image

రైల్వే విద్యుత్ వైర్లు తగిలి కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న వ్యక్తి సోమవారం మృతి చెందినట్లు రైల్వే జీ ఆర్.పి ఎస్సై బాలాజీ రావు తెలిపారు. ఈ నెల రెండో తేదీన అలమండ రైల్వే స్టేషన్ వద్ద ఆగి ఉన్న గూడ్స్ బండి ఎక్కి OHE విద్యుత్ వైర్లు తాకడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఐదు రోజులుగా చికిత్స పొందుతున్న బాధితుడు సోమవారం మరణించాడని ఆచూకీ తెలిస్తే సంప్రదించాలన్నారు.

News January 6, 2025

VZM: జాతీయ పోటీలకు 5 గురు జిల్లా క్రీడాకారులు 

image

జనవరి 8 నుంచి 12 వరకు ఉత్తరాఖండ్‌లో జరగబోయే 50 వ జాతీయ కబడ్డీ పోటీలకు జిల్లా నుంచి 5 గురు క్రీడాకారులు ఎంపికయ్యారని కబడ్డీ సంఘం ఛైర్మన్ ఐవీపీ రాజు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జూనియర్ బాల, బాలికల విభాగంలో ఎం.రాంబాబు,సి హెచ్. మురళీ, పి.నందిని, వి.సూర్యకల, ఎం. పావని ఎంపికయ్యారన్నారు. వీరు ఆంధ్రప్రదేశ్ కబడ్డీ టీంకు ఎంపికైనందుకు హర్షం వ్యక్తం చేశారు. పోటీల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు.

News January 6, 2025

VZM: పది రోజుల ముందే మొదలైన పండగ సందడి

image

విజయనగరంలో పది రోజుల ముందే పండగ వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా నగర ప్రధాన రోడ్లపై జనాలు బారులు తీరుతున్నారు. వస్త్ర దుకాణాలన్నీ జనంతో కిటకిటలాడుతున్నాయి. దీంతో మెయిన్ రోడ్డులో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పాడింది. పోలీసులు దగ్గరుండి ట్రాఫిక్‌ని సరిచేస్తున్నారు. దీంతో విజయనగరం పట్టణంలో సంక్రాంతి పండగ సందడి నెలకొంది.