News March 1, 2025

తాడిపత్రిలో సచివాలయ సిబ్బందిపై జిల్లా కలెక్టర్ అసహనం

image

తాడిపత్రి పట్టణంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ శనివారం పర్యటించారు. పట్టణ పరిధిలోని కృష్ణాపురం టు సచివాలయాన్ని తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో పీ- 4 సర్వే ఎలా జరుగుతుందో పరిశీలించారు. మిస్సింగ్ సిటిజన్, చైల్డ్ వితౌట్ ఆధార్ తదితర సర్వేకు సంబంధించి ప్రజలు అందుబాటులో లేకపోవడంతో సచివాలయ సిబ్బందిపై జిల్లా కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు.

Similar News

News March 2, 2025

కూడేరు రోడ్డు ప్రమాదం.. నాలుగుకు చేరిన మృతుల సంఖ్య

image

కూడేరు మండలం కమ్మూరు వద్ద ఆటోను కారు ఢీకొన్న ప్రమాదంలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. సరస్వతి(32) అక్కడిక్కడే మృతిచెందగా.. ఆమె కూతురు 3 నెలల చిన్నారి విద్యశ్రీ, నీలమ్మ(42), యోగేశ్వరి(40) అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. జ్ఞానాన్షిక, అచ్చిత్ కుమార్ స్వామి, ఆటో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. పెన్నహోబిలం నుంచి అనంతపురం PVKK కళాశాల విద్యార్థులు కారులో వస్తూ ఆటోను ఢీకొట్టారు.

News March 2, 2025

అనంత: వడిబియ్యం పోసుకొని వస్తూ తల్లి, కూతురు దుర్మరణం

image

అనంతపురం-బళ్లారి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. కూడేరు సమీపంలో ఆటోను కారు ఢీకొన్న ఘటనలో ఉరవకొండ మండలం రాయంపల్లికి చెందిన సరస్వతి(32), ఆమె కూతురు 3 నెలల చిన్నారి విద్యశ్రీ మృతిచెందారు. మృతురాలు గార్లదిన్నె మండలం మర్తాడులో వడిబియ్యం పోసుకొని బంధువులతో కలిసి మెట్టినింటికి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఇదే ప్రమాదంలో గాయపడిన నీలమ్మ(50) చికిత్స పొందుతూ మృతిచెందారు.

News March 2, 2025

అనంత: విషాదం.. తల్లితో పాటు 3 నెలల కుమార్తె మృతి

image

కూడేరు మండలం కమ్మూరు గ్రామ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీ, కుమార్తె మృతిచెందారు. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన కారు ఢీకొంది. ప్రమాదంలో ఆటోలో ఉన్న సరస్వతి, అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కుమార్తె 3 నెలల చిన్నారి మృతిచెందారు. ఆటోలో ఉన్న మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కారులో ఉన్న ఇద్దరు స్వల్పంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు.

error: Content is protected !!