News April 7, 2025
తాడేపల్లి: ఆర్థిక వివాదం.. యువకుడి హత్య

తాడేపల్లిలో ఓ యువకుడు హత్య కలకలం రేపింది. ఆదివారం జరిగిన హత్యపై స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్థిక వివాదంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, అది హత్యకు దారితీసిందన్నారు. భరత్ అనే యువకుడు వర్ధన్ అనే యువకుడిని కత్తితో పొడవడంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ వర్ధన్ మృతిచెందాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News April 8, 2025
GNT: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వడ్లమూడి నుంచి శుద్ధపల్లికి వెళ్లే దారిలో రేపల్లె-సికింద్రాబాద్ వెళ్లే ట్రైన్ కిందపడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి వయస్సు సుమారు 60 సంవత్సరాలు ఉండవచ్చని తెలిపారు. తెలుపు, నీలం రంగు గళ్ల చొక్కా, నీలం రంగు లుంగీ ధరించాడన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News April 8, 2025
తాడేపల్లి: మర్డర్ కేసు నిందితుల అరెస్ట్

తాడేపల్లి సీతానగరంలో జరిగిన ఇట్టా వర్ధన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. తొత్తిక భరత్, ఇసుకపల్లి ప్రకాష్ అనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య పూర్వం జరిగిన ఆర్థిక లావాదేవీల విషయంలో ఉద్భవించిన వివాదం వల్ల జరిగిందని గుంటూరు నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీ కృష్ణ సోమవారం వివరించారు. కేసును ఛేదించిన పోలీసులను అభినందించారు.
News April 8, 2025
అమరావతిలో మోదీ పర్యటనకు ఏర్పాట్లు

అమరావతి రాజధాని ప్రాంతంలో నరేంద్ర మోదీ ఈనెలలో రాజధాని నిర్మాణ పనులు పునః ప్రారంభించడానికి పర్యటించనున్నారు. నేపథ్యంలో వెలగపూడి లోని సచివాలయం వెనుక ఏర్పాటు చేయనున్న సభా ప్రాంగణాన్ని పీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఐఏఎస్ వీర పాండ్యన్ జిల్లా, ఎస్పీ సతీష్ పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ, సీఐ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.