News April 10, 2025

తాడేపల్లి: ఇప్పటంలో విషాదం.. ఇద్దరి చిన్నారుల దుర్మరణం

image

తాడేపల్లి (M) ఇప్పటంలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్ గోతిలో పడి ఇద్దరు బాలురు మృతిచెందారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రకాశం (D) అద్దంకి నుంచి పనికోసం ఓ కుటుంబం ఇక్కడికి వచ్చింది. ఈ క్రమంలో అపార్ట్‌మెంట్ గోతిలో పడి చనిపోయారు. విషయాన్ని యాజమాన్యం గోప్యంగా ఉంచి బాధిత కుటుంబం, చిన్నారుల మృతదేహాలను అద్దంకికి పంపించినట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసులు విచారణ చేపట్టారు.

Similar News

News April 19, 2025

జైళ్లలో ఖైదీల కోసం ప్రత్యేక ‘సెక్స్ రూమ్స్’

image

ఇటలీలో ఖైదీల లైంగిక కలయిక కోసం అధికారులు జైళ్లలో ప్రత్యేకంగా శృంగార గదులు ఏర్పాటు చేస్తున్నారు. 2 గంటలపాటు తమ భార్యలు, ప్రియురాళ్లతో వీరు ఏకాంతంగా గడపవచ్చు. ఆ ప్రదేశంలో గార్డుల పర్యవేక్షణ కూడా ఉండదు. కాగా ములాఖత్‌కు వచ్చే భాగస్వాములతో ఖైదీలకు శృంగారం జరిపే హక్కు ఉంటుందని అక్కడి అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో అక్కడి ఉంబ్రియా ప్రాంతంలోని జైలులో తొలి సెక్స్ గది ఏర్పాటు చేశారు.

News April 19, 2025

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మహబూబాబాద్ ఎంపీ

image

వరంగల్ మహానగరంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారిని మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజానంతరం మహా మండపంలో వేదపండితులు, అర్చకులు అమ్మవారి శేషవస్త్రములు బహూకరించి మహదాశీర్వచనం నిర్వహించి తీర్ధ ప్రసాదములు అందజేశారు.

News April 19, 2025

నాగర్‌కర్నూల్: మహిళపై గ్యాంగ్ రేప్.. నిందితుల ఇంటి వద్ద విచారణ

image

నాగర్‌కర్నూల్ జిల్లా <<16145983>>ఊర్కొండపేట<<>> పబ్బతి అంజన్న గుడి వద్ద మహిళపై గ్యాంగ్ రేప్ కేసులో నిందితులతో పోలీసులు రీకన్‌స్ట్రక్షన్ చేయించిన విషయం తెలిసిందే. కాగా ఘటనా స్థలానికి ఏడుగురు నిందితులను తీసుకొచ్చిన పోలీసులు పూర్తి స్థాయిలో సమాచారాన్ని రాబట్టారు. అలాగే అత్యాచారం ఘటన తర్వాత వారు ఇంటికి ఎలా వెళ్లారన్న కోణంపై ఆరా తీశారు. గ్రామంలోని నిందితులను వారి ఇంటికి తీసుకెళ్లి విచారణ చేపట్టారు.

error: Content is protected !!