News March 24, 2025
తాడేపల్లి: మహిళ హత్య.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన SP

తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొలనుకొండ వద్ద మహిళను గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి చంపిన ప్రాంతాన్ని ఆదివారం రాత్రి గుంటూరు ఎస్పీ సతీశ్ కుమార్ పరిశీలించారు. హత్యకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతంచేయాలని, నేరస్థులను గుర్తించి త్వరితగతిన అరెస్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు. నార్త్ డీఎస్పీ మురళీకృష్ణ, తాడేపల్లి సీఐ కల్యాణ్ రాజు ఎస్పీ వెంట ఉన్నారు.
Similar News
News March 29, 2025
GNT: వారం రోజుల పాటు ఇంటర్ సిటీ రైలు రద్దు

గుంటూరు-సికింద్రాబాద్ ఇంటర్సిటీ రైలు వారం రోజుల పాటు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. మే నెల 23 నుంచి 29 వరకు నాన్ ఇంటర్ లాకింగ్ పనులు కారణంగా గుంటూరు-సికింద్రాబాద్(12705-12706) మధ్య తిరిగే ఇంటర్ సిటీ రైలును రద్దు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి, ఆయా తేదీల్లో ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రయాణించాలని సూచించారు.
News March 29, 2025
గుంటూరు: నైట్ ఫుడ్ కోర్ట్ విషయంలో చర్చ.!

కరోనా ముందు వరకు నైట్ ఫుడ్ కోర్ట్ హిందూ కళాశాల సెంటర్లో నడిచింది. మార్కెట్కు సరుకు తెచ్చే రైతులు, ఆసుపత్రులకు, బస్టాండ్, రైల్వే స్టేషన్కు దగ్గరగా ఉండటంతో బాగా నడిచిందని, ఇప్పుడు వీటన్నిటికీ దూరంగా బ్రాడీపేట, అరండల్ పేటలో ఫుడ్ కోర్టును నిర్వహిస్తే అంత ప్రయోజనకరంగా ఉండదని ప్రజలు చర్చించుకుంటున్నారు. మున్సిపల్ అధికారులు మరోసారి పునరాలోచించి హిందూ కళాశాల రోడ్డులోనే ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు.
News March 29, 2025
ఈ-కేవైసీ చేయకపోతే రేషన్ ఆగిపోతుంది: DSO

గుంటూరు జిల్లాలో రేషన్ కార్డుదారులు ఈ-కేవైసీ చేయకపోతే మే 1వ తేదీ నుంచి రేషన్ నిలిపేస్తామని DSO కోమలి పద్మ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. రేషన్ కార్డు దారులు ఏప్రిల్ చివరి వరకు ఈ-కేవైసీ చేయించుకోవచ్చన్నారు. మొత్తం జిల్లాలో 5.99 లక్షల కార్డులు ఉండగా.. ఇప్పటి వరకు 4.70 లక్షల మంది ఈ-కేవైసీ అప్డేట్ చేయించారన్నారు. మిగిలిన వారు కూడా ఈ-కేవైసీ పూర్తి చేయించాలన్నారు.