News February 11, 2025
తాడ్వాయిలో టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి

టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం తాడ్వాయిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తాడ్వాయి గ్రామానికి చెందిన మైసయ్య(50) గ్రామపంచాయతీలో వర్కర్‌గా పని చేస్తున్నారు. టిప్పర్ వచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం పోయిందని అతని కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయారని స్థానికులు పేర్కొన్నారు.
Similar News
News December 19, 2025
కొత్తగూడెంలో 37 సీపీఐ సర్పంచులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేస్తుంది. అధికార కాంగ్రెస్ 271, ప్రతిపక్ష బీఆర్ఎస్ 105, సీపీఐ 47, ఇతరులు 46 గ్రామపంచాయతీల్లో విజయం సాధించారు. భద్రాద్రి జిల్లాలో బీజేపీ పార్టీ ఏ ఒక్క గ్రామపంచాయతీలో పాగా వేయలేదు. కొత్తగూడెం నియోజకవర్గంలో సీపీఐ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 37 సర్పంచ్ స్థానాల్లో గెలుపొందారు.
News December 19, 2025
జుక్కల్: నాడు భార్య ఏకగ్రీవం.. నేడు భర్త ప్రభంజనం!

జుక్కల్ మండలంలోని లాడేగావ్ జీపీ ఎన్నికల్లో రాజశేఖర్ పాటిల్ భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించారు. గత ఎన్నికల్లో ఈయన భార్య అశ్వినీ ఏకగ్రీవంగా ఎన్నికై గ్రామాభివృద్ధిలో తన ముద్ర వేశారు. ఈసారి ఎన్నికల్లో రాజశేఖర్ పాటిల్ సర్పంచి పీఠాన్ని కైవసం చేసుకొని వారి కుటుంబ నాయకత్వంపై మరోసారి నమ్మకాన్ని చాటారు. తన విజయంపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ, గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.
News December 19, 2025
రాజ్యసభలోనూ VB-G RAM G బిల్లుకు ఆమోదం!

ప్రతిపక్షాల నిరసనల నడుమ రాజ్యసభలో VB-G RAM G బిల్లు ఆమోదం పొందింది. కాగా బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలనే డిమాండ్‌తో ప్రతిపక్ష MPలు వాకౌట్ చేశారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ మాట్లాడుతూ.. పేదల సంక్షేమంలో ఈ బిల్లు కీలక పాత్ర పోషిస్తుందన్నారు. మహాత్మా గాంధీ ఆదర్శాలను కాంగ్రెస్ అగౌరపరుస్తోందని మండిపడ్డారు. మరోవైపు ఈ చట్టాన్ని BJP వెనక్కి తీసుకొనే రోజు వస్తుందని మల్లికార్జున ఖర్గే చెప్పారు.


