News April 24, 2025
తారాబు జలపాతం వద్ద పెందుర్తి విద్యార్థి గల్లంతు

పెందుర్తిలోని ఓ కాలేజీలో బీటెక్ చదువుతున్న విద్యార్థి తారాబు జలపాతంలో గల్లంతైనట్లు ఎస్‌ఐ రమణ తెలిపారు. నలుగురు యువకులు గురువారం జలపాతానికి వచ్చినట్లు చెప్పారు. వీరిలో వెస్ట్ గోదావరి జిల్లా భీమడోలుకి చెందిన గొన్నూరి కిషోర్ (22) జలపాతంలో ఈత కొడుతూ గల్లంతయ్యాడని తెలిపారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా కిషోర్ ఆచూకీ లభ్యం కాలేదని వెల్లడించారు.
Similar News
News April 25, 2025
30 నుంచి VSUలో టోర్నమెంట్

కాకుటూరు దగ్గర ఉన్న విక్రమ సింహపురి యూనివర్సిటీలో ఈనెల 30 నుంచి ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్ జరగనుంది. ఈ నేపథ్యంలో బోధన, బోధనేతర సిబ్బందితో వీసీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల నుంచి ప్రతినిధులు వస్తారని చెప్పారు. ఈ టోర్నీని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతిఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు.
News April 25, 2025
ADB: వడదెబ్బకు ఏడుగురి మృతి

ఉమ్మడి ADB జిల్లా అగ్నిగుండంలా మారింది. రోజురోజుకు పెరుగుతున్న ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొన్ని మండలాల్లో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వారం రోజుల్లో నిర్మల్ జిల్లాలో ముగ్గురు, మంచిర్యాల జిల్లాలో ఇద్దరు, ఆసిఫాబాద్‌లో ఒకరు, ఆదిలాబాద్‌లో ఒకరు చొప్పున మృతిచెందారు. అనధికారికంగా సంఖ్యల ఎక్కువే ఉండొచ్చు. జాగ్రత్తలు పాటించండి. బయట తిరగొద్దు. నీరు అధికంగా తాగండి.
News April 25, 2025
NRML: ఆర్థిక ఇబ్బందులతో ఒకరి ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం భైంసా మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మీర్జాపూర్ గ్రామానికి చెందిన కదం ప్రకాశ్(41) మద్యానికి బానిసై ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. వాటి తట్టుకోలేక పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.