News April 22, 2024
తిరుపతి: అనుమానంతో భార్య గొంతు నులిమి హత్య

భార్య గొంతు నులిమి హత్య చేసిన ఘటన వరదయ్యపాళెంలో జరిగింది. మండలంలోని సాధనవారిపాళెంనకు చెందిన అంజలి(23)కి తూకివాకంకు చెందిన రాజశేఖర్‌తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన 5 నెలలకే భర్త అనుమానంతో వేధిస్తుండడంతో అంజలి పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమంలో19వ తేదీన అత్తవారింటికెళ్లి అక్రమసంబంధం ఉందంటూ భార్యతో గొడవపడ్డాడు. ఇరువురి మధ్య వాగ్వాదం తీవ్రమై ఆవేశంతో రాజశేఖర్ తన భార్య గొంతు నులమడంతో మృతి చెందింది.
Similar News
News December 18, 2025
పలమనేరు: రూ.40 కోట్ల భూమి కబ్జా.?

పలమనేరు నియోజకవర్గంలో మరో భారీ భూ స్కాం ఇది. గంగవరంలోని డ్రైవర్స్ కాలనీ సమీపంలో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొందరు అప్పనంగా కబ్జా చేసినట్లు తెలుస్తోంది. చెన్నై-బెంగళూరు బైపాస్ రోడ్డుకు ఆనుకుని ఉన్న వంక పోరంబోకు భూమిపై అధికారికంగా నిషేధం ఉన్నప్పటికీ, దానిని ప్రైవేట్ భూమిగా మార్చినట్లు సమాచారం. దీని విలువ దాదాపు రూ.40 కోట్లుగా ఉంటుందట. దీనిపై మరింత సమాచారం తెలియాలి.
News December 18, 2025
కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న చిత్తూరు కలెక్టర్, ఎస్పీ

అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడీ పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా ప్రగతిపై సీఎం సదస్సులో చర్చించారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సీఎం సుదీర్ఘంగా చర్చించి పలు అంశాలపై కలెక్టర్, ఎస్పీకి దిశా నిర్దేశం చేశారు.
News December 18, 2025
చిత్తూరు: ఉగాదికి గృహప్రవేశాలు..!

చిత్తూరు జిల్లాలో వచ్చే ఉగాది నాటికి పక్కా గృహాల నిర్మాణాలను పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని CM చంద్రబాబు పేర్కొన్నారు. కలెక్టర్ల సమావేశంలో జిల్లా హౌసింగ్‌పై CM సమీక్షించారు. జిల్లాలో PMAY కింద గతంలో 73,098 గృహాలు మంజూరు కాగా 58,966 పూర్తయ్యాయి. మరో 11,048 పక్కా గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి. పాతవి 9,912 కొత్తగా మంజూరైన 2,105 గృహాలను కలిపి 12,048 గృహాలను ఉగాది నాటికి సిద్ధం చేయాలన్నారు.


