News April 26, 2024

తిరుపతి ఎంపీగా పోటీ చేసిన నేత మృతి

image

టీడీపీ నేత కారుమంచి జయరాం కన్నుమూశారు. గత రెండేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నిన్న చనిపోయారు. పోలీసు శాఖలో పని చేసిన ఆయన రిటైర్‌మెంట్ తీసుకుని పొత్తులో భాగంగా 2014లో BJP తిరుపతి MP అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో YCP అభ్యర్థి వరప్రసాద్ చేతిలో ఓడిపోయారు. 2019 ఎన్నికల ముందు TDPలో చేరారు. రేణిగుంట(M) అత్తూరులో నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Similar News

News April 25, 2025

సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం కేసులో మాధవరెడ్డి అరెస్ట్

image

మదనపల్లె సబ్ కలెక్టరేట్‌ ఫైళ్ల దగ్ధం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. YCP నేత మాధవరెడ్డిని గురువారం తిరుపతి CID పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే సబ్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ గౌతం తేజ్ అరెస్టు కాగా.. మాధవరెడ్డిని అరెస్టు చేసినట్లు CID DSP కొండయ్య నాయుడు తెలిపారు.

News April 25, 2025

సదుం ఇన్‌ఛార్జ్ తహశీల్దార్‌పై వేటు 

image

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన సదుం ఇన్‌ఛార్జ్ MRO మారూఫ్ హుస్సేన్‌ను కలెక్టర్ సుమిత్ కుమార్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనతో పాటు వీఆర్వో మహబూబ్ బాషాను కూడా సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. కొత్త MROను నియమించే వరకు ప్రస్తుతం డీటీగా ఉన్న కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

News April 25, 2025

కాణిపాకంలో సెక్యూరిటీ కట్టుదిట్టం

image

ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో కాణిపాకంలో సెక్యూరిటీ కట్టుదిట్ట చేశారు. భక్తుల బ్యాగులను సిబ్బంది క్షుణంగా తనిఖీ చేశారు. అనుమానం వచ్చిన భక్తుల గురించి వివరాలు ఆరా తీశారు. కాణిపాకంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

error: Content is protected !!