News July 15, 2024
తిరుపతి ఎస్పీకి ఘన వీడ్కోలు
తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు కడపకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా పోలీసు అధికారులు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. పోలీసు అతిథి గృహం వద్ద ఆదివారం రాత్రి జిల్లా అధికారులు పుష్పగుచ్ఛంతో సత్కరించారు. ఆయన సేవలను కొనియాడారు. తనకు సహకరించిన వారికి ఎస్పీ కృతజ్ఞతలు చెప్పారు. అడిషనల్ ఎస్పీలు విమలాకుమారి, కులశేఖర్ పలువురు అధికారులు పాల్గొన్నారు.
Similar News
News December 21, 2024
బైరెడ్డిపల్లి: డెంగ్యూతో విద్యార్థిని మృతి
బైరెడ్డిపల్లి మండలం ఓటేరిపాలెం గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని డెంగ్యూ జ్వరంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గుణశేఖర్ కుమార్తె రక్షిత 6వ తరగతి చదువుతోంది. పది రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఎంతకీ జ్వరం తగ్గకపోవడంతో తిరుపతి రుయాకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు కుటుంబీకులు పేర్కొన్నారు.
News December 21, 2024
జగన్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన పెద్దిరెడ్డి
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాజీ మంత్రి, పుంగనూరు MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుభాకాంక్షలు చెప్పారు. శనివారం బెంగళూరులోని జగన్ నివాసానికి చేరకున్న పెద్దిరెడ్డి బొకే అందించి సన్మానించారు. తమ నాయకుడు ఇలాంటి వేడుకలు మరెన్నో చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పెద్దిరెడ్డి తెలిపారు. కాగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా జగన్ జన్మదిన వేడుకలను ఆ పార్టీ కార్యకర్తలు వైభవంగా నిర్వహిస్తున్నారు.
News December 21, 2024
రామసముద్రం: హౌసింగ్ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి
రామసముద్రం మండలం చెంబకూరు పంచాయతీలోని హౌసింగ్ లేఔట్ ను శనివారం హౌసింగ్ డిఈ రమేష్ రెడ్డి, ఎంపీడీవో భానుప్రసాద్ పరిశీలించారు. పెండింగులో ఉన్న గృహనిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని డీఈ సూచించారు. పునాదులు, గోడల వరకు ఉన్న ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసినట్లయితే వెంటనే బిల్లులు లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయడం జరుగుతుందన్నారు.