News April 3, 2025

తిరుపతి: గంజాయి కేసులో GRP కానిస్టేబుల్ అరెస్ట్

image

డబ్బుకు ఆశపడి ఓ రైల్వే పోలీస్ పక్కదారి పట్టాడు. గూడూరుకు చెందిన అవినాశ్‌ సూళ్లూరుపేట రైల్వే స్టేషన్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. రైళ్లలో తనిఖీలు చేసే సమయంలో దొరికిన గంజాయిని తన ఫ్రెండ్ సునీల్ ద్వారా విక్రయిస్తున్నాడు. ఈక్రమంలో సునీల్ గూడూరు టూ టౌన్ పోలీసులకు చిక్కాడు. ఐదు ప్యాకెట్ల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సునీల్‌ ఇచ్చిన సమాచారంతో అవినాశ్‌ను అరెస్ట్ చేశామని సీఐ శ్రీనివాస్ వెల్లడించారు. 

Similar News

News April 4, 2025

గచ్చిబౌలి భూముల్లోకి బయటి వ్యక్తుల నిషేధం

image

TG: కంచ గచ్చిబౌలి భూములపై పోలీసులు కీలక ఆదేశాలిచ్చారు. ఈ వ్యవహారంతో సంబంధం లేని వ్యక్తులు ఆ భూముల్లోకి వెళ్లరాదని స్పష్టం చేశారు. ఆంక్షలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News April 4, 2025

నాగాంజలి ఆత్మహత్య.. వెలుగులోకి సంచలన విషయాలు

image

AP: రాజమండ్రిలో ఫార్మసీ విద్యార్థిని <<15986707>>నాగాంజలి ఆత్మహత్య<<>> కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెను మోసం చేసినట్లు ఆస్పత్రి ఏజీఎం దీపక్ ఒప్పుకున్నాడని పోలీసులు వెల్లడించారు. ‘నాగాంజలిని దీపక్ లైంగికంగా లోబర్చుకున్నాడు. ఆ తర్వాత చస్తే చావు.. పెళ్లి మాత్రం చేసుకునేది లేదని చెప్పాడు. దీంతో ఆమె సూసైడ్ చేసుకున్నారు’ అని పేర్కొన్నారు.

News April 4, 2025

IIT హైదరాబాద్‌కు విరాళమిస్తే నో టాక్స్

image

ప్రముఖ విద్యాసంస్థ ఐఐటీ హైదరాబాద్‌కు విరాళమిచ్చే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది. ఈ విద్యా సంస్థకు విరాళం ఇస్తే ఆ మొత్తానికి సంబంధించి టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. గతంలో 50% పన్ను చెల్లించాల్సి ఉండేది. అయితే ఇపుడు ఐటీ యాక్ట్ సెక్షన్ 80జీ ప్రకారం విరాళాలు టాక్స్ ఫ్రీ అని ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొ.బీఎస్ మూర్తి తెలిపారు.

error: Content is protected !!