News March 1, 2025
తిరుపతి జిల్లాలో 92.42 శాతం ఫించన్ పంపిణీ పూర్తి

ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ జిల్లావ్యాప్తంగా కొనసాగుతుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం 12.40 వరకు జిల్లాలో 92.42 శాతం పంపిణీ పూర్తి అయినట్లు అధికారులు వెల్లడించారు. యర్రావారిపాలెం 95.15 శాతంతో ముందు స్థానంలో ఉండగా పిచ్చాటూరు 88.64 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. సాయంత్రానికి 100 శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు.
Similar News
News March 1, 2025
పల్నాడు జిల్లా టాప్ న్యూస్

★ దాచేపల్లిలో పింఛన్ డబ్బుతో సచివాలయం ఉద్యోగి పరార్ ★ నరసరావుపేట: సీఎం చంద్రబాబుపై మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఫైర్★ సత్తెనపల్లిలో పరీక్షా కేంద్రం మార్పుపై ఇంటర్ విద్యార్థుల ఆందోళన★ చిలకలూరిపేట: బ్యాంకు కుంభకోణంలో నిందితుడి అరెస్ట్★ పల్నాడు జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 759 మంది విద్యార్థులు గైర్హాజరు★ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్..
News March 1, 2025
సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్న రంభ

సీనియర్ హీరోయిన్ రంభ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా ప్రకటించారు. ‘సినిమానే నా ఫస్ట్ లవ్. కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు ఇదే సరైన సమయం అని భావిస్తున్నా. కథలో ప్రాధాన్యం ఉన్న పాత్రలు, ఛాలెంజింగ్ రోల్స్ చేయాలనుకుంటున్నా’ అని తెలిపారు. 90ల్లో హీరోయిన్‌గా, ఆ తర్వాత స్పెషల్ సాంగ్స్‌లో నటించిన ఆమె 2010లో ఇంద్రకుమార్ అనే వ్యాపారిని వివాహమాడారు. వీరికి ముగ్గురు పిల్లలు.
News March 1, 2025
ప.గో. జిల్లా TODAY TOP HEADLINES

✷ తాడేపల్లిగూడెంలో పెన్షన్ పంపిణీ చేసిన కలెక్టర్ ✷ జిల్లాలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం ✷ మార్చి 15 నుంచి 10వ తరగతి పరీక్షలు ✷ ఢిల్లీలో వర్క్ షాపునకు ఎంపికైన మహదేవపట్నం సర్పంచ్ ✷ పోలీస్ ఇండోర్ పరీక్షల్లో టాపర్‌గా మార్టేరు అమ్మాయి ✷ తణుకు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ర్యాలీ ✷ తణుకులో 123 మంది పరీక్షలకు గైర్హాజరు