News February 12, 2025
తిరుపతి: టెన్త్ అర్హతతో 99 ఉద్యోగాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739280664907_673-normal-WIFI.webp)
టెన్త్ అర్హతతో తిరుపతి డివిజన్‌లో 59, గూడూరు డివిజన్‌లో 40 GDS పోస్టుల భర్తీకి భారత తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సైకిల్ లేదా బైక్ నడిపే సామర్థ్యం, వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వ తేదీ వరకు https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Similar News
News February 12, 2025
ఉచితాలపై సుప్రీంకోర్టు సీరియస్ కామెంట్స్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738567372276_893-normal-WIFI.webp)
ఎన్నికల్లో ఉచిత హామీలు ప్రకటించడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ప్రజలు పనిచేయడానికి ఇష్టపడటం లేదని వ్యాఖ్యానించింది. డబ్బు, ఆహారం రావడంతో ఏ పని చేయడానికీ ఇష్టపడట్లేదని పేర్కొంది. పనిచేయకుండానే డబ్బులు వస్తుండటంతో ఇలా జరుగుతుందని తెలిపింది. పట్టణాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలనే పిటిషన్‌పై విచారణలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసింది.
News February 12, 2025
సంగారెడ్డి: త్వరలో హరీశ్ రావు పాదయాత్ర
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739344477387_50001075-normal-WIFI.webp)
సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోత ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్‌తో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు త్వరలో పాదయాత్ర చేపట్టనున్నట్లు స్థానిక బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రారంభించిన ప్రాజెక్టులు భూసేకరణ దశలో నిలిచిపోయాయని, తిరిగి పనులు ప్రారంభించాలని పాదయాత్ర చేపడతామన్నారు. ముఖ్యంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలో హరీశ్ రావు పాదయాత్ర కొనసాగుతుందన్నారు.
News February 12, 2025
HYD: కాంగ్రెస్ చెప్పింది చేయలేకపోయింది: కునంనేని
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739341418796_52296546-normal-WIFI.webp)
కాంగ్రెస్ తీరు మార్చుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ముగ్ధూం భవన్‌లో ఆయన మాట్లాడుతూ..‘కాంగ్రెస్ చెప్పింది చేయలేకపోయింది. ప్రజా ప్రతినిధులు ఫోన్‌లు ఎత్తడం లేదు. సిస్టం ఫాలో అవడంలో ప్రభుత్వం విఫలమయ్యింది. ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కలిసొస్తే పోటీ చేస్తాం. లేకపోతే బలంగా ఉన్న చోట పోటీ చేస్తాం’ అన్నారు.