News March 4, 2025
తిరుపతి: తల్లి ఆచూకీ కోసం తల్లడిల్లుతున్న జవాను

తిరుపతి జిల్లా తిరుమల లోని తన తల్లి ఆచూకీ తెలిస్తే చెప్పండి అంటూ ఒక జవాను సెలవు పెట్టి తిరుపతి పరిసర ప్రాంతాల్లో చేతిలో ఫొటో పట్టుకొని వెతుకుతున్నాడు. సెలవులు ముగిసి నేపాల్ సరిహద్దులో ఉద్యోగానికి వెళ్లలేక ఇటు తల్లి ఆచూకీ కానరాక తల్లికోసం జవాను తల్లడిల్లుతున్నాడు. సోమవారం తిరుపతి కలెక్టర్‌ని కలిసి తన తల్లి మిస్సింగ్ కేసును సీరియస్‌గా తీసుకోమని ఫిర్యాదు చేశాడు.
Similar News
News March 4, 2025
నల్గొండ: ఓటు హక్కు కలిగిన ఏకైక అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి

WGL, KMM, NLG టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 19 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వారిలో ప్రభుత్వ టీచర్‌గా చేసినవాళ్లు తక్కువ మంది. అయినప్పటికీ ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ఏకైక అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి మాత్రమే. ఆయన ఎన్నికలకు ముందు తన ఉపాధ్యాయ పదవికి రాజీనామా చేసినప్పటికీ ఓటు మాత్రం ఆరు నెలల వరకు ఉంటుంది. నర్సిరెడ్డి, సర్వోత్తమ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి కూడా టీచర్‌గా పదవీ విరమణ చేశారు.
News March 4, 2025
మైక్రోచిప్, ఓలా, స్టార్‌బక్స్‌లో వేలాది ఉద్యోగాల కోత

మైక్రోచిప్, ఓలా, స్టార్‌బక్స్ సంస్థలు భారీగా ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు ప్రకటించాయి. మైక్రోచిప్ 2వేలు, ఓలా ఎలక్ట్రిక్ 1000, స్టార్‌బక్స్ 1100, హెచ్‌పీ 2వేల ఉద్యోగాల్ని తొలగించనున్నాయి. ఖర్చు తగ్గింపులో భాగంగా కొలువుల్ని తగ్గిస్తున్నట్లు సంస్థలు వివరిస్తున్నాయి. ఈ ఏడాది జూన్‌లోపు లే ఆఫ్స్ పూర్తయ్యే అవకాశం ఉంది. దీంతో ఉద్యోగుల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
News March 4, 2025
ఏలూరు: MLCగా గెలిచిన రాజశేఖరం నేపథ్యం ఇదే..!

ఉభయగోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుపొందిన పేరాబత్తుల రాజశేఖరం స్వగ్రామం కోనసీమ జిల్లాలోని జి.వేమవరం. తొలుత ఆయన కాంగ్రెస్ ఎంపీటీసీగా, అనంతరం టీడీపీ నుంచి ఎంపీపీ, జడ్పీటీసీగా పనిచేశారు. ఆక్వా వ్యాపారం చేసే రాజశేఖరం ప్రస్తుతం కాకినాడలో నివాసం ఉంటున్నారు. B.com పూర్తిచేసిన ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్న రాజశేఖరానికి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి వరించింది.