News February 19, 2025

తిరుపతి: న్యాయ సేవ సహాయకుల పోస్టులకు నోటిఫికేషన్

image

తిరుపతి జిల్లాలోని గూడూరు, కోట, వెంకటగిరి, S.పేట, N.పేటల్లో న్యాయ సేవ అధికార కమిటీల పారా లీగల్ సహాయకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు నెల్లూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ గీత తెలిపారు. 25 లోగా దరఖాస్తులను రిజిస్టర్ పోస్టు ద్వారా జిల్లా కోర్టుకు అందించాలన్నారు. ఇంటర్, ఆపైన చదివిన పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు, అంగన్‌వాడీ సేవకులు, లా విద్యార్థులు దరఖస్తు చేసుకోవచ్చన్నారు.

Similar News

News December 14, 2025

పెద్దపల్లిలో ప్రశాంతంగా కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికలు: DCP

image

పెద్దపల్లి జిల్లాలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని డీసీపీ బి.రామ్ రెడ్డి తెలిపారు. అంతర్గం మండలం కుందన్పల్లి, పెద్దంపేట్, ఎల్లంపల్లి, మూర్ముర్, గోళీవాడ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు. భద్రతా చర్యలు, సిబ్బంది విధులు, ఓటర్లకు కల్పించిన సౌకర్యాలపై సమీక్షించారు. ప్రజలు భయాందోళనలేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించాలని కోరారు.

News December 14, 2025

బిగ్‌బాస్-9.. భరణి ఎలిమినేట్!

image

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉన్న విషయం తెలిసిందే. నిన్న అంతా ఎక్స్‌పెక్ట్ చేసినట్లుగానే సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. ఆదివారం ఎపిసోడ్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారా? అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే ఇవాళ భరణి ఎలిమినేట్ కానున్నారని SMలో పోస్టులు వైరలవుతున్నాయి. అదే జరిగితే కళ్యాణ్, తనూజ, ఇమ్మాన్యుయేల్, డిమాన్ పవన్, సంజన టాప్-5కి చేరుకుంటారు.

News December 14, 2025

మంచిర్యాల జిల్లాలో 56.44% పోలింగ్

image

2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బెల్లంపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న 2వ విడత పోలింగ్ 56.44% జరిగినట్లు అధికారులు తెలిపారు. బెల్లంపల్లిలో 63.5%, భీమిని 67.5%, కన్నెపల్లి 62.56, కాసిపేట 51.49%, నెన్నెల 55.56%, తాండూర్ 48.58%, వేమనపల్లిలో 57.07% పోలింగ్ నమోదయింది. .