News March 25, 2025
తిరుపతి: పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులు భర్తీ చేసేందుకు ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఆర్ఓ నరసింహులు తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో పరీక్షలు నిర్వహణపై ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంగళవారం నుంచి మూడు రోజులపాటు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. 2,080 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు ఆయన వివరించారు.
Similar News
News December 16, 2025
విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా చోడే పట్టాభిరామ్?

విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా చోడే పట్టాభి రామ్‌కు పార్టీ అధిష్ఠానం అవకాశం కల్పించినట్లు సమాచారం. పట్టాభి 8వ వార్డులో మాజీ కార్పొరేటర్‌గా పని చేశారు. ప్రస్తుతం ఆయన టీటీడీ బోర్డు లోకల్ అడ్వైజర్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు.
News December 16, 2025
HYD: దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు? బుక్ చదివారా?

తాపీ ధర్మారావు రచించిన <<18569096>>ఈ పుస్తకం<<>> ఆలయ శిల్పాలపై ఉన్న అజ్ఞానం, ద్వంద్వ నైతికతను ప్రశ్నిస్తుంది. శృంగార శిల్పాలపై ఉన్న అసభ్య ముద్రను చెరిపేసి, వాటి వెనుక దాగిన సాంస్కృతిక, సామాజిక, ఆధ్యాత్మిక తాత్విక అర్థాలను స్పష్టంగా విశ్లేషిస్తుంది. కోరికల నియంత్రణ, జీవన సమగ్రత, ఆలయం వెలుపల- లోపల తాత్విక భావనను సంక్షిప్తంగా వివరిస్తుంది. ఖజురహో వంటి ఉదాహరణలతో చరిత్రను విశ్లేషించి, పాఠకుడిని ఆలోచింపజేస్తుంది.
News December 16, 2025
రేపే మూడో విడత ఎన్నికల పోలింగ్

TG: రేపు 182 మండలాల్లోని 3,752 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. మూడో విడతలో మొత్తం 4,159 సర్పంచ్ స్థానాలకు SEC నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 394 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 3,752 స్థానాలకు 12,652 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 28,410 వార్డు మెంబర్ల స్థానాలకు 75,725 మంది బరిలో నిలిచారు.


