News April 12, 2025
తిరుపతి: మామా.. నా రిజల్ట్ చూడు రా..!

తిరుపతి జిల్లాలో 62,760 మంది ఇంటర్ పరీక్షలు రాశారు. ఫస్ట్ ఇయర్‌లో 32,213మంది, సెకండియర్‌లో 30,548 మంది ఫలితాలు రానున్నాయి. గతంలో హాల్‌టికెట్లతో నెట్ సెంటర్లకు వెళ్లగా.. నేడు అందరూ ఫోన్లు చేతపట్టుకుని వేయిట్ చేస్తున్నారు. ‘మామా.. నీకు సిగ్నల్ బాగుంటే నా రిజల్ట్ కూడా చూడు’ అంటూ పట్టణాల్లో ఉండేవారికి పల్లెటూరి విద్యార్థులు మెసేజ్ చేస్తున్నారు.
☞ వే2న్యూస్ యాప్‌లో వేగంగా ఫలితాలు చూసుకోవచ్చు.
Similar News
News April 19, 2025
బేగంపేట: యముడు, చిత్రగుప్తుడి అవతారం ఎత్తారు

బేగంపేట చౌరస్తాలో NIPPON ఎక్స్‌ప్రెస్ CSR కమ్యూనిటీ సర్వీస్‌లో భాగంగా వాహనదారులకు వినూత్న రీతిలో పోలీసులు యముడు, చిత్రగుప్తుడి వేషధారణలో ట్రాఫిక్ నిబంధనలపై అవేర్నెస్ కల్పించారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద హెల్మెట్, సీటు బెల్టులేని వారికి వాటి ఆవశ్యకతను వివరించారు. ట్రాఫిక్ ఏసీపీ వెంకటేశ్వర్లు, CI రామచందర్, బోస్‌కిరణ్, SI భూమేశ్వర్, NIPPON సుధీర్ నాయర్, కలీంఅలీ, అనిల్, ప్రియాంక సుధాకర్ సిబ్బంది ఉన్నారు.
News April 19, 2025
పెద్దపల్లి: PACS కొనుగోలు కేంద్రాలు సిద్ధం

పెద్దపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ఆధ్వర్యంలో వివిధ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు సిద్ధమయ్యాయి. పీఏసీఎస్ పరిధిలో 200కు పైగా కొనుగోలు కేంద్రాలకు రైతుల తమ ధాన్యాన్ని తరలిస్తున్నారు. దాదాపు 90% వరి కోతలు పూర్తయ్యాయి. మరో నెల రోజుల్లో కొనుగోళ్ల ప్రక్రియ కూడా పూర్తి కానున్నట్లు అధికారులు తెలిపారు.
News April 19, 2025
కూటమి వైఫల్యాలే వైసీపీకి శ్రీరామరక్ష : ధర్మాన

రాష్ట్రంలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వం వైఫల్యాలే వైసీపీకి శ్రీరామరక్షగా నిలుస్తాయని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణ దాస్ అన్నారు. శనివారం తాడేపల్లి కార్యాలయంలో జరిగిన రాష్ట్రస్థాయి సదస్సులో ఆయన పాల్గొన్నారు. లేనిపోని హామీలను గుప్పించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. గడిచి పది నెలలు పూర్తైనా నెరవేర్చలేకపోయారని విమర్శించారు.