News April 6, 2025
తిరుపతి: రేపు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు

తిరుపతి శ్రీవేంకటేశ్వర అగ్రికల్చర్ కళాశాలలో కాంట్రాక్టు ప్రాతిపదికగా మెడికల్ ఆఫీసర్ పోస్ట్‌కు సోమవారం ఉదయం 11 గంటలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. MBBS పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. ఇతర వివరాలకు angrau.ac.in వెబ్‌సైట్ చూడాలని సూచించారు.
Similar News
News April 17, 2025
పలాయనం చిత్తగించిన కూటమి నేతలు: రోజా

AP: దమ్ముంటే ఛాలెంజ్ స్వీకరించాలని ట్వీట్లు చేసిన కూటమి నేతలు ఫోన్ ఎత్తకుండా పలాయనం చిత్తగించారని వైసీపీ నేత రోజా ఎద్దేవా చేశారు. తమ పార్టీ నేతలు ప్రూఫ్‌లతో సహా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఛాలెంజ్‌లు విసరకూడదని ఆమె మండిపడ్డారు. తిరుపతిలో టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తమ నేతల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని ఆమె హెచ్చరించారు.
News April 17, 2025
చికిత్సకు డబ్బులు వేస్ట్ అని రియల్టర్ సూసైడ్?

UPలో క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ రియల్టర్ తుపాకీతో భార్యను కాల్చి చంపి, తనను తాను కాల్చుకున్నాడు. చికిత్సకు అనవసరంగా డబ్బు ఖర్చు చేసేందుకు ఇష్టం లేక చనిపోతున్నట్లు సూసైడ్ లెటర్‌లో రాశారు. ఘజియాబాద్‌కు చెందిన కుల్దీప్ త్యాగి (46), అన్షు త్యాగి భార్యాభర్తలు. ఇటీవల కుల్దీప్‌కు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో చికిత్సకు డబ్బులు వెచ్చించే బదులు మిగిలించడం మేలని భావించి ప్రాణాలు తీసుకున్నారు.
News April 17, 2025
సిరిసిల్ల: సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి: ఎస్పీ

లాడ్జీ యజమానులు లాడ్జీలలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గితే సూచించారు. లాడ్జీలలో వచ్చే వారి వివరాలు తప్పకుండా నమోదు చేయాలన్నారు. లాడ్జీల కేంద్రగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అన్నారు. లాడ్జీలలో తరచూ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు.