News February 6, 2025

తిరుపతి: రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెళ్ల మృతి

image

చిత్తూరు జిల్లా విజయపురం మండల తెల్లగుంట గ్రామ సమీపంలో అన్నాచెల్లెలు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. బంధువుల సమాచారం మేరకు.. నిండ్ర మండలం అగరం పేట గ్రామానికి చెందిన రవి(48), KVB.పురం మండలం కళత్తూరు గ్రామానికి చెందిన మంజుల (44)అన్నా చెల్లెలు. వారు ఇద్దరు కలిసి పెద్ద అక్క దేశమ్మ ఇంటికి వెళ్లి తిరిగి ప్రయాణంలో తెల్లగుంట వద్ద లారీ ఢీకొని మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News February 6, 2025

ఆదిలాబాద్: సర్పంచ్ ఎన్నికలు.. గ్రామాల్లో సందడి!

image

ఆదిలాబాద్ జిల్లాలోని 18 మండలాల్లో సుమారు 467 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఫిబ్రవరి 15లోగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఇటీవల పలువురు ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. ఎన్నికల బరిలో దిగేందుకు మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, నూతన అభ్యర్థులు సర్వం సిద్ధమవుతున్నారు. మీ గ్రామంలో పరిస్థితి ఎలా ఉందో కామెంట్ చేయండి. 

News February 6, 2025

గజ్వేల్‌లో KCR రాజీనామా చేయాలా.. వద్దా..?: (VIRAL)

image

GHMC కార్పొరేటర్ ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సరూర్‌నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి‌ BRS తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తూ.. ‘అసెంబ్లీకి రాని, ప్రజల సమస్యలు పట్టించుకోని KCR గారు గజ్వేల్ MLAగా రాజీనామా చేయాలా..? వద్దా..?’ అని ప్రశ్నించారు. దీనిపై ఇరు పార్టీల సోషల్ యాక్టివిస్ట్‌‌లు స్పందించారు. నిజమే అని BJP శ్రేణులు.. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది ఏంటని BRS నేతలు పోటీ పడటం గమనార్హం.

News February 6, 2025

BREAKING: ఫిరాయింపుల ఎమ్మెల్యేల కీలక నిర్ణయం

image

TG: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన ఎమ్మెల్యేలు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేవంత్ అధ్యక్షతన జరిగే సీఎల్పీ సమావేశానికి హాజరుకావొద్దని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం ఇదే విషయమై అసెంబ్లీ సెక్రటరీ ఈ ఎమ్మెల్యేలకు నోటిసులు జారీ చేశారు.

error: Content is protected !!