News March 21, 2024
తిరుపతి సీటు కోసం ఢిల్లీలో లాబీయింగ్

ఇటీవల వైసీపీకి దూరమైన గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ రావు తిరుపతి ఎంపీ పోటీకి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరిని కలిశారు. ఆయినప్పటికీ ఆయన సీటుపై ఎలాంటి భరోసా ఇవ్వలేదని సమాచారం. తాజాగా ఆయన ఢిల్లీ బాట పట్టారు. అక్కడ ఆయనకు ఉన్న పరిచయాలతో తిరుపతి బీజేపీ ఎంపీగా బరిలోకి దిగేందుకు లాబీ చేస్తున్నారని తెలుస్తోంది.
Similar News
News April 8, 2025
గణనాథుని దర్శించుకున్న డైరెక్టర్ మారుతి

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని సినీ దర్శకుడు మారుతి దర్శించుకున్నారు. సోమవారం ఆయన స్వామి వారి దర్శనానికి రాగా ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. మారుతి ప్రభాస్ హీరోగా ‘రాజాసాబ్’ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
News April 7, 2025
చిత్తూరు జిల్లాలో ఉద్యోగాలు.. 9 లాస్ట్ డేట్: శ్రీదేవి

సీడాప్ ఆధ్వర్యంలో DDUGKY పథకం ద్వారా చిత్తూరు, తిరుపతిలో ఉచిత నైపుణ్య శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు డీఆర్డీఎ పీడీ శ్రీదేవి తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన 18-28 ఏళ్లలోపు యువతీ యువకులు ఈనెల 9వ తేదీలోపు అడ్మిషన్లు చేసుకోవాలన్నారు. ఈ రెసిడెన్షియల్ కోర్సు మూడు నెలల పాటు ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ఇతర వివరాలకు 9963561755 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
News April 7, 2025
చిత్తూరు: ప్రజల నుంచి అర్జీల స్వీకరణ

చిత్తూరు జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక(గ్రీవెన్స్ డే) సోమవారం జరిగింది. ఇందులో భాగంగా ప్రజల నుంచి కలెక్టర్ సుమిత్ కుమార్ అర్జీలను స్వీకరించారు. డీఆర్వో మోహన్ కుమార్, చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్లు విజయ లక్ష్మి, అనుపమ, కలెక్టరేట్ ఏవో కులశేఖర్ తదితరులు ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఫిర్యాదులను సకాలంలో పరిష్కరిస్తామన్నారు.