News March 21, 2025

తిరుపతిలో 248 మందికి సబ్సిడీ రుణాలు

image

తిరుపతి పార్లమెంట్ పరిధిలో పీఎం మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పథకం అమలుపై కేంద్ర మంత్రిని ఎంపీ గురుమూర్తి పార్లమెంట్‌లో ప్రశ్నించారు. కేంద్ర ఆహార పరిశ్రమల శాఖ సహాయ మంత్రి రావ్నీత్ సింగ్ సమాధానం ఇస్తూ… తిరుపతి పార్లమెంట్ పరిధిలో 248 మంది లబ్ధిదారులకు రూ.8.09 కోట్లు సబ్సిడీ రుణాలు మంజూరు చేసినట్లు ప్రకటించారు.

Similar News

News March 22, 2025

భాష పేరుతో రాజకీయం అందుకే? అమిత్ షా

image

కొన్ని రాజకీయ పార్టీలు తమ అవినీతిని కప్పి పెట్టడానికే భాష పేరుతో రాజకీయం చేస్తున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆరోపించారు. సౌత్ ఇండియా భాషలను తాము వ్యతిరేకిస్తున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారని అది ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. తమిళనాడులో NDA కూటమి అధికారంలోకి వస్తే మెడిసిన్, ఇంజినీరింగ్ పాఠ్య పుస్తకాలను తమిళ భాషలోకి అనువదిస్తామని తెలిపారు.

News March 22, 2025

సోనాలలో హల్చల్ చేసిన గంగవ్వ

image

సోనాలలోని ఓ పాఠశాలలో శుక్రవారం రాత్రి జరిగిన వార్షికోత్సవంలో మై విలేజ్ షో యూ ట్యూబర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వ పాల్గొని సందడి చేశారు. గంగవ్వను చూడడానికి ప్రేక్షకులు దండెత్తారు. ప్రేక్షకులతో మై విలేజ్ షో యూట్యూబ్లో చేసిన అనుభవాలను పంచుకున్నారు. గంగవ్వతో సెల్ఫీలు దిగడానికి యువత ఆసక్తి కనబరిచారు.

News March 22, 2025

ఖానాపూర్: పాకాల వాగు సమీపంలో ముసలి ప్రత్యక్షం

image

గూడూరు మండలం లక్ష్మీపురం గ్రామ సమీపంలో ఉన్న పాకాల వాగు వద్ద మొసలి కలకలం రేపింది. ఎండలు తీవ్రంగా ఉండటంతో చెరువులు, వాగులు, కుంటలల్లో చుక్క నీరు లేకుండా పోయింది. దీంతో శుక్రవారం రాత్రి పాకాల వాగు వద్ద మొసలి రోడ్డు పైనుంచి దాటుతుండంతో గమనించిన ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రాత్రి సమయంలో ఈ దారిగుండా వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని స్థానికులు తెలుపుతున్నారు.

error: Content is protected !!