News September 26, 2024
తిరుపతిలో 30 పోలీస్ యాక్ట్ అమలు
శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఈనెల 25 నుంచి అక్టోబర్ 24 వరకు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసులకు అందరూ సహకరించాలని కోరారు.
Similar News
News December 21, 2024
జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన పెద్దిరెడ్డి
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాజీ మంత్రి, పుంగనూరు MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుభాకాంక్షలు చెప్పారు. శనివారం బెంగళూరులోని జగన్ నివాసానికి చేరకున్న పెద్దిరెడ్డి బొకే అందించి సన్మానించారు. తమ నాయకుడు ఇలాంటి వేడుకలు మరెన్నో చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పెద్దిరెడ్డి తెలిపారు. కాగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా జగన్ జన్మదిన వేడుకలను ఆ పార్టీ కార్యకర్తలు వైభవంగా నిర్వహిస్తున్నారు.
News December 21, 2024
రామసముద్రం: హౌసింగ్ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి
రామసముద్రం మండలం చెంబకూరు పంచాయతీలోని హౌసింగ్ లేఔట్ ను శనివారం హౌసింగ్ డిఈ రమేష్ రెడ్డి, ఎంపీడీవో భానుప్రసాద్ పరిశీలించారు. పెండింగులో ఉన్న గృహనిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని డీఈ సూచించారు. పునాదులు, గోడల వరకు ఉన్న ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసినట్లయితే వెంటనే బిల్లులు లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయడం జరుగుతుందన్నారు.
News December 21, 2024
కుప్పానికి రూ.451 కోట్లు.. జీవో ఇచ్చి మళ్లీ రద్దు
CM చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం అభివృద్ధికి ప్రభుత్వం స్పెషల్ గ్రాంట్ కింద రూ.456 కోట్లు మంజూరు చేస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పరిపాలన అనుమతులను మంజూరు చేసింది. కుప్పం పరిధిలో 130 KM మేర అండర్ డ్రైనేజ్, 11 అభివృద్ధి పనులకు ఈ నిధులు వినియోగించాలని ఆదేశించింది. నిన్న రాత్రే ఈ జీవోను రద్దు చేసింది. పనుల్లో కొన్ని మార్పులు చేసి మరోసారి జీవో ఇస్తారని సమాచారం.