News February 2, 2025
తిరుపతిలో రెచ్చిపోయిన దొంగలు..1.48 కిలోల బంగారం చోరీ
తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ విల్లాలో భారీ దొంగతనం జరిగినట్లు పోలీసులు తెలిపారు. దొంగలు వరుసగా 4 ఇళ్లలో చేతివాటం ప్రదర్శించి దాదాపు 1.48 కిలో బంగారాన్ని ఎత్తుకెళ్లారు. విల్లాలోని 80, 81, 82, 83 ఇండ్లలో చోరీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. బాధితులు మేఘనాథ రెడ్డి ఇంట్లో 1 కేజీ బంగారం, కేశవ నాయుడు ఇంట్లో 48 గ్రాముల బంగారం చోరీకి గురైంది.
Similar News
News February 2, 2025
ఆర్మూర్: ఇది సకల జనుల బడ్జెట్: కలిగోట్ గంగాధర్
ప్రధాని మోడీ నాయకత్వంలో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ సకల జనులకు ఆమోదయోగ్యంగా ఉందని BJP జిల్లా అధికార ప్రతినిధి కలిగోట్ గంగాధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 8 సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారని, మధ్య తరగతి వారికి పన్ను భారం తగ్గిందని, రూ.12 లక్షల వరకు ఆదాయం పన్ను రద్దు చేశారని పేర్కొన్నారు. విద్య, వైద్యం, తాగునీటిపై ప్రత్యేక శ్రద్ధ చూపారని అన్నారు.
News February 2, 2025
మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలి: కలెక్టర్
మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని అందించాలని వరంగల్ కలెక్టర్ సత్య శారద అన్నారు. నెక్కొండ మండలంలో హాస్టళ్లను కలెక్టర్ విస్తృత తనిఖీలు నిర్వహించి, భోజనం రుచి చూసి మాట్లాడారు. హాస్టల్ నిర్వాహకులు విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు కల్పించాలన్నారు. పాఠశాల రికార్డులు పరిశీలించి సమయ పాలన పాటించాలన్నారు.
News February 2, 2025
విలేకరిపై పూజా హెగ్డే ఆగ్రహం
‘దేవా’ మూవీ ప్రెస్‌మీట్‌లో ఓ విలేకరిపై నటి పూజా హెగ్డే ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సల్మాన్, హృతిక్, రణ్‌వీర్, షాహిద్ వంటివారి సరసన అవకాశాలు రావడం మీ లక్ అనుకుంటున్నారా? అందుకు మీకు అర్హత ఉందని భావిస్తున్నారా? పెద్ద హీరోల్ని చూసి సినిమాలు సెలక్ట్ చేసుకుంటారా?’ అంటూ విలేకరి అడిగిన ప్రశ్నల పట్ల ఆమె మండిపడ్డారు. నాతో మీ సమస్యేంటి అని ప్రశ్నించారు. వెంటనే హీరో షాహిద్ కలుగజేసుకుని ఆమెను శాంతింపజేశారు.