News April 13, 2025

తిరుమల: PIC OF THE DAY 

image

ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా శనివారం రాత్రి శ్రీవారి ఆనంద నిలయం చంద్రుని కాంతిలో మెరిసిపోయింది. పౌర్ణమి చంద్రుడు ఆలయ శిఖరంపై తన ప్రకాశాన్ని విరజిమ్ముతూ భక్తులను మంత్ర ముగ్ధులను చేశాడు. ‘ఓ చంద్రమా, నా ఆనంద నిలయం నుంచి ప్రపంచానికి చల్లటి నీడను ఇవ్వు’ అన్న భావనను నిజం చేస్తూ తిరుగిరులపై చంద్రుని చల్లని వెలుగు పరచుకుంది. 

Similar News

News April 14, 2025

ఉక్రెయిన్‌కు రండి.. ట్రంప్‌కు జెలెన్‌స్కీ ఆహ్వానం

image

US అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్ సందర్శించాలని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కోరారు. రష్యా తమ దేశంలో చేసిన విధ్వంసం చూడాలన్నారు. యుద్ధంతో తమ దేశంలో నెలకొన్న పరిస్థితులు, మరణించిన, గాయపడిన ప్రజలు, దెబ్బతిన్న కట్టడాల్ని చూసిన అనంతరం ఏదైనా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఫిబ్రవరిలో ట్రంప్, జెలెన్‌స్కీ మధ్య జరిగిన చర్చలు వాగ్వాదంతో అర్ధాంతరంగా ముగిశాయి.

News April 14, 2025

అంబేడ్కర్‌కి నివాళి అర్పించిన కలెక్టర్

image

ఒంగోలులో అధికారులు, ప్రజాప్రతినిధులు అంబేడ్కర్ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. HCM కళాశాల సెంటర్, కలెక్టరేట్ సెంటర్‌లో ఉన్న అంబేడ్కర్ విగ్రహాలకు జిల్లా కలెక్టర్ అన్సారియా, ఒంగోలు, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, విజయ్ కుమార్, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, డీఆర్ఓ చిన్న ఓబులేసు, వివిధ దళిత సంఘాల నాయకులు ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం అంబేడ్కర్ గురించి కొనియాడారు.

News April 14, 2025

సంచలనం.. దంతాలు ఎప్పుడు ఊడినా వృద్ధి చేయొచ్చు

image

పిల్లల్లో పాలదంతాలు ఊడిపోయి కొత్తవి వస్తాయి. వాటిని కోల్పోతే మళ్లీ రావు. తాజాగా ప్రపంచంలోనే తొలిసారి UK సైంటిస్టులు ల్యాబ్‌లో మానవ దంతాలను సృష్టించారు. దంతాల వృద్ధికి అవసరమైన వాతావరణాన్ని కల్పించే ఓ పదార్థాన్ని అభివృద్ధి చేశారు. భవిష్యత్తులో రోగులు కోల్పోయిన దంతాలను వారిలోనే వృద్ధి చేయొచ్చంటున్నారు. ఫిల్లింగ్స్, ఇంప్లాంట్స్‌ అవసరం ఉండదని, దంత రక్షణలో ఇదో విప్లవాత్మక పురోగతి అని చెబుతున్నారు.

error: Content is protected !!