News July 1, 2024

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పొన్నం

image

కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆ ఏడు కొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఉభయ రాష్ట్రాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. వర్షాలు, ఆరోగ్యం, పాడి పంటలు, సుఖ సంతోషాలతో ఇబ్బందులు లేకుండా ఉండాలని ఆ భగవంతుడుని ప్రార్థిస్తున్నానని అన్నారు.

Similar News

News September 21, 2024

కొండా ల‌క్ష్మ‌ణ్ సామాజిక చైత‌న్యానికి నిలువెత్తు నిద‌ర్శ‌నం: హ‌రీశ్

image

స్వాతంత్ర్య సమరయోధుడు, స్వరాష్ట్రం కోసం పరితపించిన తెలంగాణ వాది, నిబద్ధత కలిగిన రాజకీయ వేత్త, తెలంగాణ సామాజిక చైతన్యానికి నిలువెత్తు నిదర్శనం కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. బాపూజీ వ‌ర్ధంతి సంద‌ర్భంగా హ‌రీశ్‌రావు నివాళుల‌ర్పించారు.

News September 21, 2024

నర్సాపూర్: డిపో సరే.. డ్రైవర్లు ఎక్కడా?

image

నర్సాపూర్‌లో ఆర్టీసి డిపో ఏర్పాటు కావడంతో ఇక తమ ప్రయాణ కష్టాలు తీరుతాయని ఈ ప్రాంత వాసులు ఆశించారు. అయితే ప్రయాణికుల అవసరాలకు తగినట్లు బస్సులు నడపకపోవడంతో అధికారులు విఫలమవుతున్నారు. డిపోలో ఉన్నా బస్సులకు అనుగుణంగా మొత్తం 45 మంది డ్రైవర్లకు 36 మంది ఉన్నారు. దీంతో సరైన రూట్లో బస్సులు నడువక అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News September 21, 2024

కొండా లక్ష్మణ్‌బాపూజీ తెలంగాణకు నిత్యస్ఫూర్తి: కేసీఆర్

image

తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం తన జీవితకాలం పోరాడిన తొలితరం నేత కొండా లక్ష్మణ్‌ బాపూజీ అని, ఆయన తెలంగాణకు నిత్యస్ఫూర్తి అని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన బాపూజీ స్ఫూర్తి తాను సాగించిన చివరిదశ తెలంగాణ సాధన పోరాటంలో ఇమిడి ఉన్నదని తెలిపారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకొని వారి కృషిని కేసీఆర్‌ స్మరించుకున్నారు.