News August 31, 2024
తిరుమలలో కూలిన భారీ వృక్షం.. మహిళకు తీవ్ర గాయాలు
శ్రీవారి దర్శనార్థం తమిళనాడుకు చెందిన భక్తులు తిరుమలకు వచ్చారు. ఈ నేపథ్యంలో తిరుమలలోని ఎస్ఎంసి కాటేజ్ ప్రాంతంలోని 305 గదిని తీసుకున్నారు. ఆరు బయట వారు సేద తీరుతున్న సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో విపరీతమైన గాలులు వీయడంతో అక్కడే ఉన్న భారీ వృక్షం కూలి ఉమామహేశ్వరి (44) అనే మహిళపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆమె అశ్విని హాస్పిటల్ నుంచి వెంటనే తిరుపతి సిమ్స్ కు తరలించారు.
Similar News
News January 11, 2025
13న పి.జీ.ఆర్.ఎస్ రద్దు : చిత్తూరు కలెక్టర్
13వ తేదీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం భోగి పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో జిల్లా సచివాలయంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా ప్రజలు సహకరించాలని కోరారు.
News January 10, 2025
తిరుమల: భక్తులకు క్షమాపణ చెప్పిన టీటీడీ ఛైర్మన్
తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో తమ తప్పులేకపోయినా భక్తులందరికీ బేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్టు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులను ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అంతకు ముందు మీడియాతో మాట్లాడుతూ..క్షమాపణ చెప్పడంలో తప్పులేదు. క్షమాపణ చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్లు తిరిగిరారు.ఎవరో ఏదో మాట్లాడారని స్పందించాల్సిన అవసరం లేదు అని వ్యాఖ్యానించారు.
News January 10, 2025
కొండంత జనం
తిరుమలలో శుక్రవారం వేకువజాము నుంచే వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా ప్రారంభం అయ్యాయి. లక్షల సంఖ్యలో వచ్చిన భక్తులతో శ్రీవారి ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. వీఐపీలతో పాటూ సాధారణ భక్తులు తిరుమల వేంకన్నను ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకున్నారు. నారాయణుడి నామస్మరణతో తిరుమల ప్రాంగణం మార్మోగింది. స్వామి వారి స్వర్ణ రథోత్సవం సందర్భంగా తీసిన ఫొటోలు అబ్బుర పరుస్తున్నాయి.