News March 6, 2025
‘తీన్మార్ మల్లన్న ఏది మాట్లాడినా.. సీఎం వివరణ ఇవ్వాలి’

తీన్మార్ మల్లన్న, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అన్నారు. రేవంత్ టీపీసీసీ చీఫ్, సీఎం కావాలని తీన్మార్ మల్లన్న బలంగా కోరుకున్నారని తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో పార్టీ బలహీనపడుతుందనే కారణంగా రేవంత్‌కు టీపీసీసీ పదవి ఇవ్వాలని మల్లన్న కోరారని చెప్పారు. తీన్మార్ మల్లన్న ఏది మాట్లాడినా దానికి వివరణ రేవంత్ రెడ్డి ఇవ్వాలన్న వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.
Similar News
News April 23, 2025
HYD: నెహ్రూ జూలాజికల్ పార్కులో సమ్మర్ క్యాంప్

నెహ్రూ జూలాజికల్ పార్కులో హైదరాబాద్ జూ జూస్టాస్టిక్ సమ్మర్ క్యాంప్ నిర్వహించనున్నట్లు క్యూరేటర్ తెలిపారు. మే మొదటి వారంలో ప్రారంభమై జూన్ వరకు ఈ సమ్మర్ క్యాంపు ఉంటుందన్నారు. 5 నుంచి పదవ తరగతి విద్యార్థులు పాల్గొనవచ్చని చెప్పారు. ఒక్కరికి రూ.1000 ఫీజు ఉంటుందని, ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. క్యాంప్‌లో జూ టూర్, సరీసృపాల అవగాహన సెషన్, నైట్ హౌస్ సందర్శన, ఇతర కార్యక్రమాలు ఉంటాయన్నారు.
News April 23, 2025
OU: బీ ఫార్మసీ పరీక్షా ఫలితాలు విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఫార్మసీ కోర్సు పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. బీ ఫార్మసీ(పీసీఐ) సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఫలితాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.in లో చూసుకోవాలని సూచించారు. -SHARE IT..
News April 22, 2025
‘హజ్ యాత్రికులకు మెరుగైన సదుపాయాలు కల్పించండి’

హజ్ హౌస్‌లో రాష్ట్రస్థాయి సమన్వయ సమావేశం జరిగింది. మైనార్టీ సంక్షేమ శాఖ సంచాలకులు షేక్ యాస్మిన్ భాష అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 11,000 మంది హజ్ యాత్రికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని శాఖల అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఏప్రిల్ 29 నుంచి మే 29 వరకు విమానాలు మదీనా, జిద్దా వెళ్లనున్నాయి. జూన్ 12 నుంచి జూలై 9 వరకు తిరుగు ప్రయాణాల షెడ్యూల్ ఉంది.