News February 14, 2025
తుని: దర్శకుడు ఏలేటి చంద్రశేఖర్‌కి పితృవియోగం

ప్రముఖ సినీ దర్శకుడు ఏలేటి చంద్రశేఖర్ తండ్రి ఏలేటి సుబ్బారావు (73) అనారోగ్యంతో మృతి చెందారు. కాకినాడ జిల్లా తుని మండలం రేఖవానిపాలెం గ్రామంలో గురువారం సాయంత్రం కుటుంబ సభ్యులు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. సంగీత దర్శకుడు, మృతుని బంధువులైన ఎంఎం కీరవాణి, రాజమౌళి సతీమణి తదితరులు గ్రామానికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Similar News
News March 12, 2025
శ్రీకాకుళంలో ఇంటర్ పరీక్షలకు 427 మంది గైర్హాజరు

శ్రీకాకుళం జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. బుధవారం ఇంటర్ పరీక్షలకు హాజరైన విద్యార్థుల వివరాలను RIO దుర్గారావు ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 19,093 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 18,666 మంది హాజరైనట్లు వెల్లడించారు. 427 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మాల్ ప్రాక్టీస్ ఒక దగ్గర జరిగిందని స్పష్టం చేశారు.
News March 12, 2025
లబ్ధిదారులు ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలి: KMR కలెక్టర్

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బిక్నూర్ మండలం ర్యాగట్ల పల్లి లో బుధవారం ఆయన సందర్శించారు. గ్రామంలో ఇండ్ల నిర్మాణం కోసం వేసిన ముగ్గును పరిశీలించారు. మండలంలో 145 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని అధికారులు కలెక్టర్ తెలిపారు. వెంట గృహనిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయ్ పాల్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
News March 12, 2025
భయమనేది నా రక్తంలోనే లేదు: విజయసాయి

AP: కాకినాడ పోర్టు కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. విజయవాడలోని సీఐడీ కార్యాలయం వద్ద ఆయన మాట్లాడారు. ‘కావాలనే కొందరు నన్ను ఈ కేసులో ఇరికించారు. కేవీ రావుతో నాకు ఎలాంటి సంబంధాలు లేవు. ఆయనంటేనే నాకు అసహ్యం. ఈ కేసులో కర్త, కర్మ, క్రియ అన్నీ విక్రాంత్ రెడ్డే. కొందరు ఎదగడానికి నన్ను కిందకు లాగారు. భయమనేది నా రక్తంలోనే లేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.