News February 25, 2025
తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ టీడీపీలోకి చేరిక

తునిలో వైసీపీకి మరో షాక్ తగిలింది. మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే ఛైర్ పర్సన్ ఏలూరు సుధారాణి రాజీనామా చేసిన కొన్ని గంటలకే ఆరుగురు కౌన్సిల్ సభ్యులు టీడీపీ గూటికి చేరారు. తాజాగా సోమవారం సాయంత్రం హైదరాబాదులో యనమల దివ్య సమక్షంలో వైస్ ఛైర్మన్ కూచ్చర్లపాటి రూపా దేవి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికీ టీడీపీ బలం 16కు చేరుకుంది.
Similar News
News February 25, 2025
3 ఓవర్లలోనే సెంచరీ.. మీకు తెలుసా?

ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ డాన్ బ్రాడ్‌మన్ క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని ఓ రికార్డును సృష్టించారని మీకు తెలుసా? 1931లో జరిగిన ఓ దేశవాళీ మ్యాచ్‌లో 3 ఓవర్లలోనే సెంచరీ చేశారు. ఆ సమయంలో ఓవర్‌కు 8 బంతులు ఉండేవి. తొలి ఓవర్‌లో 33, రెండో దాంట్లో 40, మూడో ఓవర్లో 27 పరుగులు చేసి సెంచరీ బాదారు. ప్రస్తుతం ఓవర్‌కు 6 బంతులే ఉండటంతో 3 ఓవర్లలో సెంచరీ చేయడం అసాధ్యమే.
*ఇవాళ బ్రాడ్‌మన్ వర్ధంతి
News February 25, 2025
ఫేక్ ఉద్యోగ ప్రకటనలపై జాగ్రత్త: ఎస్పీ

ఫేక్ ఉద్యోగ ప్రకటనలు, లాటరీ ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వ్యక్తిగత సమాచారం, పాస్‌వర్డ్‌లు, క్రెడిట్ కార్డ్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దన్నారు. అపరిచిత లింక్‌లు, ఈమెయిల్‌లపై క్లిక్ చేయవద్దన్నారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు ఎక్కువగా షేర్ చేయవద్దన్నారు.
News February 25, 2025
హనుమంతుడి నుంచి మనం నేర్చుకోవాల్సినవి!

* మీరు ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన వ్యక్తి అయినప్పటికీ, వినయంగా ఉండండి
* ఇతరుల సంక్షేమం కోసం మీ అధికారాలను ఉపయోగించండి
* ఇంద్రియాలను మీరు నియంత్రించాలి. అవి మిమ్మల్ని నియంత్రించకూడదు
* పాపాలు చేసే వారి పట్ల దయ చూపొద్దు
* నిర్భయంగా, నమ్మకంగా ఉండండి
* క్రమం తప్పకుండా శారీరక & మానసిక బలాన్ని మెరుగుపరుచుకోండి