News March 13, 2025
తునిలో మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో దరఖాస్తులు ఆహ్వానం

తునిలో గల మహాత్మ జ్యోతిబాపూలే సంక్షేమ గురుకుల బాలురు పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ యజ్ఞ విశ్వశాంతి బుధవారం తెలిపారు. 5, 6, 7, 8, 9 తరగతి వరకు అర్హులైన విద్యార్థులంతా ఈ నెల 15వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఆన్లైన్‌తో పాటు నేరుగా పాఠశాల వద్దకు వచ్చి దరఖాస్తులు అందజేయొచ్చని చెప్పారు.
Similar News
News March 15, 2025
శుభ ముహూర్తం (15-03-2025)

☛ తిథి: బహుళ పాడ్యమి మ.12.59 వరకు
☛ నక్షత్రం: ఉత్తర ఉ.7.43 తదుపరి హస్త
☛ శుభ సమయం: ఉ.11.56 నుండి 12.32 వరకు
☛ రాహుకాలం: మ.9.00-10.30 వరకు
☛ యమగండం: మ.1.30-3.00 వరకు
☛1.దుర్ముహూర్తం: .ఉ.6.00-7.36 వరకు
☛ వర్జ్యం: సా.4.57నుండి6.42 వరకు
☛ అమృత ఘడియలు: లేదు
News March 15, 2025
బాపట్ల జిల్లా కలెక్టర్ సూచనలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర స్వచ్ఛత దివాస్ కార్యక్రమం శనివారం సూర్యలంక బీచ్‌లో జరగనుంది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి పాల్గొంటున్నట్లు కలెక్టర్ కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొంటున్నట్లు తెలిపారు.
News March 15, 2025
విజయవాడ: ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్

ఈ నెల 21వ తేదీన రెబల్ స్టార్ ప్రభాస్, శృతిహాసన్ నటించిన సలార్ చిత్రాన్ని విజయవాడలో రీ రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రం విజయవాడలోని 8 థియేటర్లలో రీ రిలీజ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. కాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలోని యాక్షన్ సీన్లు సినీ అభిమానులను ఉర్రూతలూగించాయి.