News March 22, 2024

తూ.గో: NRI ఓటర్లు@1,006.. ఎగిరొచ్చేస్తారంతే!

image

ప్రపంచంలో ఏ మూలనున్నా సొంతూరు రాజకీయాలపై ఉండే ఆసక్తే వేరు. ఐదేళ్లకోసారొచ్చే ఎన్నికల పండక్కి ఎలాగైనా వచ్చి ఓటేస్తుంటారు NRI ఓటర్లు. ఉమ్మడి తూ.గో జిల్లాలో 1,006 మంది NRI ఓటర్లు ఉంటే.. పురుషులు-790, స్త్రీలు- 215, థర్డ్ జెండర్ ఒకరు ఉన్నారు. తూ.గో జిల్లాలో 442, కాకినాడ-292, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 272 మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో రాజమండ్రి నుంచి అధికంగా 173 మంది ఉంటే.. తుని నుంచి ముగ్గురు ఉన్నారు.

Similar News

News November 22, 2024

తూ.గో: CBI నుంచి అంటూ ఫేక్ కాల్

image

పి.గన్నవరానికి చెందిన ఓ వైద్యవిద్యార్థిని తండ్రికి గురువారం డిజిటల్ అరెస్ట్ కాల్ వచ్చింది. CBI నుంచి ఫోన్ చేస్తున్నామంటూ ఓ వ్యక్తి(పై ఫోటో) వాట్సాప్ కాల్ ద్వారా బెదిరించాడు. మీ కుమార్తెను అరెస్ట్ చేశామని, తమ అదుపులో ఉందని చెప్పాడు. అయితే కొద్దిసేపటి ముందే తన కుమార్తెతో మాట్లాడిన చంద్రశేఖర్ ఫేక్ కాల్ అని గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. ఇలాంటి ట్రాప్ కాల్స్ వలలో పడొద్దని పోలీసులు సూచిస్తున్నారు.

News November 22, 2024

ఉభయ గోదావరి ఎమ్మెల్సీ అభ్యర్థులు ఐదుగురే.!

image

ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులు చివరకు ఐదుగురే మిగిలారు.‌ ఉపఎన్నికల్లో ఒక నామినేషన్ ఉపసంహరణ అనంతరం ఐదుగురు అభ్యర్థులు పోటీలో నిలిచినట్లు కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ గురువారం తెలిపారు. 1.గంధం నారాయణరావు, 2.దీపక్ పులుగు,‌ 3.నాగేశ్వరరావు కవల, 4.నామన వెంకట లక్ష్మీ, 5.బొర్రా గోపీ మూర్తి అభ్యర్థులు బరిలో నిలిచినట్లు చెప్పారు. 5న పోలింగ్, 9న ఓట్ల లెక్కింపు జరుగుతుందని వివరించారు.

News November 22, 2024

కాగ్‌ అధిపతిగా కోనసీమ జిల్లా వాసి ప్రమాణ స్వీకారం

image

ప్రతిష్ఠాత్మక భారత కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ బాధ్యతలను అమలాపురం మాజీ ఎంపీ కెఎస్ఆర్ మూర్తి కుమారుడు కొండ్రు సంజయ్‌మూర్తి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా సంజయ్ మూర్తి అరుదైన ఘనత సాధించారు. 1964 డిసెంబర్ 24న జన్మించిన ఆయన మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు.