News December 11, 2024
తూ.గో: అలా జరిగి ఉంటే వారు బతికి ఉండేవాళ్లు
మరో 5 కిలో మీటర్లు ప్రయాణించి ఉంటే ఇంటికి చేరుకునే వారు. అంతలో వారిని మృత్యువు కబళించింది. పి.గన్నవరం మండలం ఊడిమూడి వద్ద మంగళవారం జరిగిన ప్రమాదంలో పోతవరానికి చెందిన విజయ్ కుమార్ భార్య, కుమారుడు మృతి చెందగా.. మరొక కుమారుడు గల్లంతయ్యారు. దీంతో విజయ్ కుమార్ కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. భార్యాపిల్లలను కోల్పోయానని అతడు మృతదేహాల వద్ద రోధించిన తీరు అందరినీ కలచివేసింది.
Similar News
News December 27, 2024
తూ.గో: న్యూ ఇయర్ వేడుకలపై ఎస్పీ కీలక సూచనలు
న్యూ ఇయర్ వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని తూ.గో. జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ సూచించారు. కొవ్వూరు రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్లో గురువారం ఎస్పీ తనిఖీలు చేశారు. మద్యం సేవించి రోడ్లపై అల్లర్లు సృష్టిస్తే ఉపేక్షించేది లేదన్నారు. సైలెన్సర్లు పీకి వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామన్నారు. డిసెంబర్ 31న మద్యం దుకాణాలు సమయపాలన పాటించాలని సూచించారు. రౌడీ షీటర్లను బైండోవర్ చేస్తామన్నారు.
News December 26, 2024
శంఖవరం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
శంఖవరం మండలం వేలంగి-పెద్దమల్లాపురం మధ్య బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అన్నవరం పోలీసుల వివరాల మేరకు.. పెదమల్లాపురానికి చెందిన బోడోజు వెంకట రమణ (18), బలుం సుబ్రహ్మణ్యం (24) బైక్‌పై వేళంగి నుంచి పెదమల్లాపుంకు వెళ్తుండగా అదుపు తప్పి చెట్టును ఢీకొట్టారు. దీంతో ఇద్దరు మృతి చెందారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News December 26, 2024
తాళ్లపూడి: కాలువలో మునిగి బాలుడి మృతి
తాళ్లపూడి మండలం బల్లిపాడులో నాలుగేళ్ల బాలుడు కాలువలో పడి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికుల కథనం మేరకు గురువారం బల్లిపాడు ఎస్సీ నివాసిత ప్రాంతంలో కాలువ గట్టున బాలుడు ఆడుకుంటూ కాలువలో పడ్డాడు. ఎవరూ గమనించకపోవడంతో మృతి చెందాడని తెలిపారు. తల్లి ఝాన్సీ రాణి రోదన చూపరులకు కన్నీరు తెప్పించింది.