News May 10, 2024
తూ.గో: ఎన్నికలు, సెలవులు.. ఫుల్ రద్దీ
ఒక వైపు ఎన్నికలు.. మరొక వైపు సెలవులు కావడంతో ఆర్టీసీతో పాటు రైల్వేలలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఉమ్మడి తూ.గో జిల్లాకు చెందిన వేల మంది హైదరాబాదులో ఉపాధి పొందుతున్నారు. అక్కడి నుంచి స్వస్థలాలకు వచ్చేందుకు రైల్వేతో పాటు ఆర్టీసీలోనూ టిక్కెట్లు దొరకని పరిస్థితి. ఈ నెల 11, 12, 13 తేదీల్లో రద్దీ ఎక్కువగా ఉండనుంది. HYD నుంచి రాజమహేంద్రవరానికి నిత్యం 4 సర్వీసులు నడుస్తుండగా.. మరో 3 ఏర్పాటు చేశారు.
Similar News
News November 25, 2024
రేపు యథావిధిగా పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం: కలెక్టర్ ప్రశాంతి
సోమవారం ‘మీ కోసం’ కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ పి. ప్రశాంతి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి సోమవారం ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజల నుంచి అర్జీలను జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో, రెవెన్యు డివిజనల్, మునిసిపల్, మండలస్థాయిలో అధికారులు తీసుకుని త్వరతగతిన పరిష్కారిస్తారని ఆమె తెలిపారు.
News November 24, 2024
కోనసీమ వాసికి అవార్డు అందించిన సినీ నటి కీర్తి సురేశ్
ఉమ్మడి తూ.గో.జిల్లా పి.గన్నవరంలో రెండున్నర దశాబ్దాల నుంచి మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీగా సభ్యులకు సేవలు అందిస్తున్నందుకు ధనవర్ష సొసైటీకి ప్రముఖ సినీనటి కీర్తి సురేశ్ అవార్డు అందించారు. హైదరాబాదులోని తాజ్ కృష్ణ హోటల్లో శనివారం జరిగిన సమావేశంలో అవార్డు అందించారని సంగం ఛైర్మన్ కంకిపాటి ప్రసాద్ ఆదివారం తెలిపారు.
News November 24, 2024
గోకవరం: బిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి
బిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి చెందిన విషాదకర ఘటన గోకవరం ప్రభుత్వాసుపత్రిలో జరిగింది. రాజవొమ్మంగి మండలం కొండపల్లికి చెందిన వెంకటలక్ష్మి గోకవరం ఫారెస్ట్ చెక్‌పోస్ట్‌లో పని చేస్తున్నారు. ప్రసవం నిమిత్తం ఆపరేషన్ చేస్తుండగా ఉమ్మనీరు రక్తనాళాల్లోకి వెళ్లి గుండెపోటు వచ్చి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నవమాసాలు మోసి ఆ తల్లి బిడ్డను చూడకుండానే మృతి చెందడం కలిచివేసింది.