News March 18, 2024

తూ.గో, కోనసీమ జిల్లాల్లో ఎల్లుండి వర్షాలు!

image

తూర్పు గోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఈనెల 20వ తేదీన (బుధవారం) వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, పలుచోట్ల తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Similar News

News April 4, 2025

గోపాలపురం: ఫ్యాన్‌కు ఉరేసుకొని మహిళ సూసైడ్

image

మనస్తాపానికి గురై ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. గోపాలపురం మండలం నందిగూడెం గ్రామంలో కోళ్ల ఫారంలో పనిచేస్తున్న సతామి కోటల్ (30)తో సునీల్ కోటల్ అనే వ్యక్తి సహజీవనం చేస్తున్నాడు. బుధవారం వీరి మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో మనస్తాపం చెందిన ఆ మహిళ ఇంటిలో ఫ్యాన్‌కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కోళ్ల ఫారం యజమాని సమాచారంతో పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

News April 3, 2025

రాజమండ్రిలో పార్మసిస్ట్ కేసు దర్యాప్తు

image

లైంగిక వేధింపుల కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడి అపార అపస్మారక స్థితిలో ఉన్న అంజలి కేసు విషయంలో దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగుతోందని డీఎస్పి భవ్య కిషోర్ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం స్థానిక ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కేసులో నిందితుడుని దీపక్‌ని అరెస్ట్ చేశామన్నారు. సూసైడ్ నోట్ ఆధారంగా చేసుకుని రాజకీయ లబ్ధికి కొందరు కేసును పక్కదారి పట్టించడం తగదన్నారు.

News April 2, 2025

రాజమండ్రి: ఆందోళనకరంగా నాగాంజలి ఆరోగ్య పరిస్థితి

image

వేధింపులు తాళలేక ఆత్మయత్నానికి పాల్పడి బొల్లినేని హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఫార్మసిస్ట్ ఆరోగ్య పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ప్రస్తుతం ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో అత్యవసర విభాగానికి తరలించినట్లు డా. పీవీవీ సత్యనారాయణ, డా. అనిల్ కుమార్, డా. సీ.హెచ్. సాయి నీలిమ ప్రభుత్వ వైద్య బృందం బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. రక్తపోటు, పల్స్, శ్వాసక్రియ, నాడీ వ్యవస్థ స్పందన తక్కువగా ఉందన్నారు.

error: Content is protected !!