News March 23, 2025
తూ.గో: క్యాన్సర్ కేసుల నమోదులో భయాందోళనలు వద్దు

తూ.గో జిల్లా బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ కేసుల నమోదు విషయంలో భయాందోళనలు వద్దని కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. శనివారం ఆమె బలభద్రపురంలో పర్యటించి అధికారులతో సమీక్షించారు. జాతీయ సగటు ప్రతి 10 వేలకు గాను 30 మందికి క్యాన్సర్ కేసుల నమోదు అవుతుండగా, అనపర్తి నియోజక వర్గం బలభద్రపురంలో 23 కేసులు గుర్తించినట్లు తెలిపారు. గ్రామంలో ప్రత్యేక వైద్య బృందం ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News March 26, 2025
ఉపసర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి: జేసీ

జిల్లాలో 12 గ్రామాలలో ఈ నెల 27న ఉప సర్పంచ్‌ల, బిక్కవోలు మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు, పెరవలి, రంగంపేటల రెండు కో-ఆప్షన్ సభ్యుల పరోక్ష ఎన్నికల ప్రక్రియను సజావుగా నిష్పక్షపాతంగా నిర్వహించాలని, ఆ మేరకు అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో సమన్వయ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు.
News March 25, 2025
కొంతమూరు: ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి

కొంతమూరు హైవే సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల (45) అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్ నివాసి అయిన పాస్టర్ రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో దిగి వ్యక్తిగత పనులు నిమిత్తమై బైక్‌పై వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఆయన చనిపోయారు. దీంతో నగరంలో ఉన్న పాస్టర్లు అందరూ వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి చేరుకున్నారు.
News March 25, 2025
రాజమండ్రిలో జంట హత్యలు.. అసలేం జరిగిందంటే.!

రాజమండ్రిలో జంట హత్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే. DSP శ్రీవిద్య ఈ కేసులో కీలక విషయాలు వెల్లడించారు. శ్రీకాకుళానికి చెందిన శివకుమార్, సుమియా లవర్స్. తండ్రి మృతిచెందగా ఆమె తల్లి సాల్మాతో రాజమండ్రిలో ఉంటోంది. సుమియా వేరే వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతోందని శివ గొడవపడ్డాడు. ఆదివారం సుమియా మేడపైకి వెళ్లగా.. పడుకొని ఉన్న తల్లిని కత్తితో చంపేసి, తలుపు వెనుక ఉండి కూతురినీ చంపేశాడు. నిందితుడు అరెస్టయ్యాడు.