News March 15, 2025
తూ.గో జిల్లా ప్రజలకు గమనిక

వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికెట్లపై తూ.గో జిల్లా రవాణా శాఖ అధికారి ఆర్.సురేశ్ కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు రాష్ట్ర, జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో వాహనాలను పరిశీలించి ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇచ్చామన్నారు. ఇకపై ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా సర్టిఫికెట్లు మంజూరు చేస్తామన్నారు. జిల్లాలోని ప్రజలు రాజానగరంలోని కంట్రోల్ అల్ట్ ఫిక్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను సంప్రదించి సర్టిఫికెట్లు తీసుకోవాలన్నారు.
Similar News
News March 17, 2025
రాజమండ్రి: భానుడి భగభగ

తూ.గో. జిల్లాలో అప్పుడే ఎండ దంచేస్తుంది. కొన్ని మండలాల్లో వడగాలుల వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం రాజమండ్రిలో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత ఇంకా ఇంకా పెరిగే అవకాశం ఉంది. వడ గాల్పులతో అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు జాగ్రత్తలు తీసుకుని బయటికి రావాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
News March 17, 2025
రాజమండ్రి: రేపు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ నిర్వహణ

ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యలు పరిష్కార వేదిక పీజీఆర్‌ఎస్ కార్యక్రమం మార్చి 17 వ తేదీ సోమవారం యధావిధిగా కలక్టరేట్, డివిజన్, మండల కేంద్రం, మున్సిపల్ కార్పొరేషన్, పురపాలక సంఘం పరిధిలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పి.ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా పరిధిలోని సమస్యలపై ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తామన్నారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొవాలన్నారు.
News March 17, 2025
రాజమండ్రి: పది పరీక్షలకు సర్వం సిద్ధం: కలెక్టర్

తూర్పు గోదావరి జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు 25,723 మంది134 పరీక్షా కేంద్రాల్లో వార్షిక పరీక్షలకు హాజరు కానున్నట్లు ఇందుకు సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఒక ప్రకటనలో తెలిపారు. ఉ. 9.30 నుంచి మ. 12.45 వరకూ పరీక్షలు జరుగుతాయని, విద్యార్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. తాగునీరు, వైద్య శిబిరాలను అందుబాటులో ఉంచామని కలెక్టర్ తెలిపారు.