News February 26, 2025
తూ.గో: జిల్లాలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటర్లు 62,970

ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో తూ.గో జిల్లాలో 62,970 మంది ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంతి మంగళవారం ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 27న జరగనున్న ఎన్నికలకు 92 పోలింగ్ కేంద్రాలను 15 రూట్‌లలో ఏర్పాటు చేశామన్నారు. మొత్తం ఓటర్లలో పురుషులు 36,366 మంది, స్త్రీలు 27,601 మంది ఇతరులు ముగ్గురు ఉన్నారన్నారు.
Similar News
News February 26, 2025
నల్లజర్ల: రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు

ఏపీలో రేపు ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మండలాల వారీగా నిర్దేశించిన పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 8:00 నుంచి సాయంత్రం 4:00గంటల వరకు పోలింగ్ జరగనుంది. గతంలో 2019 మార్చి ఎమ్మెల్సీ ఎన్నికలలో 11 మంది బరిలో దిగగా, ఈసారి 35 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. గోపాలపురం పరిధిలో ఓటర్లు 6443, గోపాలపురం 1777, దేవరపల్లి 2166, నల్లజర్ల 2500గా ఓటర్లు ఉన్నారు.
News February 26, 2025
మృతదేహాలు కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామం అంతా మహా శివరాత్రి పర్వదినాన ఆ గ్రామం అంతా విషాదంతో నిండిపోయింది. నది స్థానానికి దిగిన 11 మందిలో ఐదుగురు గల్లంతయి మృత్యువాత పడ్డారు. దీంతో కలెక్టర్ ప్రశాంతి ఉదయం నుంచి అధికారులను అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయంతో వెలికితీసిన మృతదేహాలను పంచనామా నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
News February 26, 2025
ధవళేశ్వరం: స్నేహబంధం.. ఇలా చెదిరిపోయింది

వారిద్దరిది ఒకే ఊరు.. ఒకే ప్రాంతం. పక్క పక్కనే ఇళ్లు, ఒకరిని వదిలి ఒకరు ఉండలేని స్నేహబంధం వారిది. అయితే మృత్యువు రూపంలో ఆ బంధం చెదిరిపోయింది. వివరాలు ఇలా.. ధవళేశ్వరం జాలరి పేటకు చెందిన ప్రాణ స్నేహితులు నాగమళ్ల ముత్యాలు(19), బొడ్డు వెంకటేష్ (16) మంగళవారం బైక్‌పై వెళుతూ ఆర్టీసీ బస్సును ఢీకొన్న ప్రమాదంలో స్పాట్‌లోనే మరణించారు. ఈ దుర్ఘటన చూసిన వారు స్నేహబంధం ఇలా విడిపోయిందంటూ కన్నీరు పెట్టుకున్నారు.