News February 27, 2025

తూ.గో : తీరని విషాదం నింపిన శివరాత్రి

image

ఆ ఐదుగురికి 20 ఏళ్లు దాటలేదు. శివరాత్రి రోజే వారిని మృత్యువు వెంటాడింది. రెండు వేరువేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. తాళ్లపూడి(M) తాడిపూడిలో పుణ్యస్నానానికి వెళ్లి పవన్(17), దుర్గాప్రసాద్(19), పవన్(19), ఆకాష్ (19), పడాల సాయి(19) ఐదుగురు గల్లంతై చనిపోయారు. ప్రతిపాడు(M) రాచపల్లి నుంచి పట్టిసీమకు వెళుతుండగా చిడిపి వద్ద ఆటో బోల్తాపడటంతో రమణ అనే వ్యక్తి చనిపోయారని పోలీసులు తెలిపారు.

Similar News

News February 27, 2025

చిరుత కళేబరానికి పోస్టుమార్టం పూర్తి

image

శ్రీశైలం క్షేత్ర పరిధి రుద్రపార్కు సమీపంలోని అటవీ ప్రాంతంలో బుధవారం మృతి చెందిన చిరుత కళేబరానికి గురువారం వైల్డ్ లైఫ్ డాక్టర్లు అరుణ్ వెస్లీ ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. తొలుత అనుమానాస్పద స్థితిలో చిరుత మరణించినట్లు అటవీ అధికారులు భావించినప్పటికీ పోస్టుమార్టం రిపోర్టులో మానవ ప్రమేయం లేనట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఆ తదుపరి పలు నమూనాలను లేబరేటరీకి పంపించినట్లు అటవీ అధికారులు తెలిపారు.

News February 27, 2025

జూ పార్క్ టికెట్ ధరలు భారీగా పెంపు

image

TG: హైదరాబాద్ నెహ్రూ జూపార్కులో వివిధ టికెట్ ధరలను భారీగా పెంచారు. ఇప్పటివరకు ఎంట్రన్స్ టికెట్ పెద్దలకు రూ.75, పిల్లలకు రూ.45 ఉండగా.. ఇక నుంచి రూ.100, రూ.50 వసూలు చేస్తామని అధికారులు ప్రకటించారు. ట్రైన్ రైడ్ టికెట్ పెద్దలకు రూ.80, పిల్లలకు రూ.40గా నిర్ణయించారు. బ్యాటరీ వెహికల్ రైడ్ ధర రూ.120 అని తెలిపారు. అలాగే పార్కింగ్ ధరలు సైతం పెంచారు. మార్చి 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయన్నారు.

News February 27, 2025

పోసానిపై థర్డ్ డిగ్రీ: కొరముట్ల

image

సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం పోసానిని గురువారం ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ క్రమంలో కోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పోసానిని కలిసేందుకు వెళ్లగా పోలీసులు అనుమతించకపోవడంతో పోసానిపై థర్డ్ డిగ్రీ ఉపయోగించారని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది. విచారణ అనంతరం మాట్లాడిస్తామని పోలీసులు తెలిపారు.

error: Content is protected !!