News February 13, 2025
తూ.గో: నాటుకోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739413566235_1128-normal-WIFI.webp)
బర్డ్ ఫ్లూ అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది. కోళ్ల రైతులు, పెంపకందారులు బెంబేలెత్తిపోతున్నారు. బర్డ్ ఫ్లూ నాటుకోళ్లపై కూడా తాజాగా ప్రభావం చూపుతోంది. బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా కానూరు అగ్రహారంలో కోళ్ల ఫారాల్లో కోళ్లన్నీ చనిపోయాయి. వైరస్ కానూర్ అగ్రహారంలో నాటుకోళ్లకూ సోకింది. అక్కడ వ్యాధి సోకిన నాటుకోళ్లను పూడ్చివేశారు. దాదాపు 500 నాటుకోళ్లు చనిపోయాయి.
Similar News
News February 13, 2025
తూ.గో జిల్లా మీదుగా నాలుగు ప్రత్యేక రైళ్ల రాకపోకలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739370415342_71671997-normal-WIFI.webp)
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 14,16,21,23 తేదీలలో జిల్లా మీదుగా పలు రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ప్రకటించారు. 14, 21 తేదీలలో చర్లపల్లి – కాకినాడ టౌన్(070310),16,23 తేదీలలో కాకినాడ టౌన్ చర్లపల్లి(07032) రైళ్లు నడవనున్నాయని తెలిపారు. ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్లను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
News February 13, 2025
తూ.గో: ఈనెల 14న బహిరంగ వేలం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739405736103_50559814-normal-WIFI.webp)
వివిధ ఘటనలో సీజ్ చేసిన 47,274 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని ఈనెల 14న గోపాలపురంలోని ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద బహిరంగ వేలం వేయనున్నట్లు JC చిన్నరాముడు ఒక ప్రకటనలో చెప్పారు. అదే రోజున దేవరపల్లిలో వెంకటేశ్వర రైస్ మిల్ వద్ద కూడా 16.00 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని వేలం వేయనున్నట్లు చెప్పారు. వేలంలో పాల్గొనే వారు ముందుగా రూ.5 వేలు ధరావత్తు చెల్లించాలన్నారు. కిలో బియ్యం రూ.22కి నిర్ణయించామన్నారు.
News February 13, 2025
కొవ్వూరులో హీరో రామ్ సినిమా షూటింగ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739379724233_1152-normal-WIFI.webp)
సినీ హీరో రామ్ పోతినేని 22వ సినిమా షూటింగ్ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం ఆరికిరేవుల గ్రామంలో జరిగింది. మైత్రీ మూవీస్ బ్యానర్లో నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. మంగళవారం ఆరికిరేవుల స్నానఘట్టం, గోదావరి నది వద్ద సన్నివేశాలను చిత్రీకరించారు. మహేష్‌బాబు.పి దర్శకత్వం వహిస్తుండగా హీరోయిన్గా భాగ్యశ్రీ ,రావు రమేష్, బ్రహ్మానందం, హర్షవర్దన్‌లు నటిస్తున్నారని చిత్ర యూనిట్ తెలిపింది.