News February 14, 2025
తూ.గో: నామినేషన్లు విత్ డ్రా చేసుకుంది వీరే..

గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 35 మంది నిలిచారు. మొత్తం 54 మంది నామినేషన్ వేయగా అధికారులు 11 మంది నామినేషన్లను తిరస్కరించారు. అందులో 8 మంది విత్ డ్రా చేసుకున్నారు. 35 మంది బరిలో నిలిచారు. పిల్లంగొళ్ల లీలా నగేశ్, విజయలక్ష్మీ, కవల నాగేశ్వరరావు, పచ్చిగోళ్ల దుర్గారావు, పేరాబత్తుల సత్యవాణి, గండుమోలు బాలాజీ, సత్తి రాజు స్వామి, కోండ్రు చక్రపాణి విత్ డ్రా చేసుకున్నారు.
Similar News
News December 20, 2025
ఏపీ ఇంటర్ బోర్డుకు అరుదైన ఘనత: మంత్రి లోకేశ్

AP ఇంటర్ బోర్డుకు నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్&ట్రైనింగ్ (NCVET) రికగ్నిషన్ లభించిందని మంత్రి లోకేశ్ తెలిపారు. దేశంలో అవార్డింగ్ బాడీ (AB-డ్యుయల్)గా గుర్తింపు పొందిన తొలి బోర్డుగా AP ఇంటర్ బోర్డు నిలిచిందన్నారు. దీని వల్ల వొకేషనల్ స్కిల్స్‌కు నేషనల్ లెవెల్‌లో సర్టిఫికేషన్ ఇచ్చే అర్హత BIEకి దక్కిందని తెలిపారు. తొలి దశలో సెరికల్చర్ టెక్నీషియన్ క్వాలిఫికేషన్‌కు అనుమతి లభించిందన్నారు.
News December 20, 2025
చీపురు పట్టిన కర్నూలు కలెక్టర్ సిరి

కర్నూలు కలెక్టరేట్ ఆవరణలో శనివారం నిర్వహించిన ‘స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.సిరి స్వయంగా చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు. జేసీ నూరుల్ ఖమర్‌తో కలిసి అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రతను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ప్రతి ఒక్కరూ తమ కార్యాలయాలను, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు.
News December 20, 2025
విద్యార్థులే రాష్ట్రానికి పెద్ద ఆస్తి: CBN

AP: విద్యార్థులే రాష్ట్రానికి పెద్ద ఆస్తి అని CM CBN పేర్కొన్నారు. వారంతా నాలెడ్జి ఎకానమీలో భాగం కావాలని సూచించారు. విద్యార్థుల వ్యక్తిగత పరిశుభ్రత మెరుగుపరిచేలా రాష్ట్రంలో ‘ముస్తాబు’ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. త్వరలోనే 75 లక్షల మంది ఆరోగ్యాన్ని పరీక్షిస్తామని చెప్పారు. కష్టపడి చదివితే లక్ష్యాన్ని సాధిస్తారన్నారు. అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం స్కూలు విద్యార్థులతో CM మాట్లాడారు.


