News November 9, 2024
తూ.గో: పవన్ కళ్యాణ్‌కు తమ్మల రామస్వామి కృతజ్ఞతలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కాకినాడ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పెద్దాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ తుమ్మల రామస్వామి కృతజ్ఞతలు తెలిపారు. శనివారం తనను కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) ఛైర్మన్‌గా నియమించినట్లు సమాచారం అందుకున్న తుమ్మల రామస్వామి (బాబు) హుటాహుటిన మంగళగిరి వెళ్లారు. అక్కడ జనసేన కార్యాలయంలో పార్టీ అధినేత పవన్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించి ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News November 14, 2024
పెద్దాపురం: హత్యకేసులో ముద్దాయికి జీవిత ఖైదు
కల్లు గీత కత్తితో ఇద్దరిని హతమార్చిన కేసులో ముద్దాయికి బుధవారం జీవిత ఖైదు విధిస్తూ పెద్దాపురం కోర్టు తుది తీర్పు ఇచ్చినట్లు జగ్గంపేట సీఐ శ్రీనివాస్ తెలిపారు. జగ్గంపేటకు చెందిన వానశెట్టి సింహాచలం భార్యతో నైనపు శ్రీను వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు అతడిని, దానికి సహకరించిన బత్తిన భవానీని హతమార్చాడు. దీనిపై 2013లోనే కేసు నమోదైంది. ఇప్పుడు 11 సంవత్సరాల తర్వాత తుది తీర్పు వెలువడింది.
News November 13, 2024
గోకవరం: 1250 కేజీల నకిలీ టీపొడి స్వాధీనం..
గోకవరం మండలం రంపఎర్రంపాలెంలోని రైస్ మిల్లులో నకిలీ టీపొడి తయారు చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో 31 బస్తాల్లో నిల్వ ఉన్న 1250 కేజీల నకిలీ టీపొడిని ల్యాబ్‌కు పంపించామన్నారు. వాటితోపాటు 15క్రీం మెటీరియల్ బ్యాగులను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. టీపొడి నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించినట్లు తెలిపారు.
News November 13, 2024
సైబర్ నేరాలపై తస్మాత్ జాగ్రత్త : ఎస్పీ నరసింహ
ప్రస్తుత తరుణంలో సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ సూచించారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి షేర్ చేయడం గాని, సైబర్ నేరగాళ్ల నుంచి వచ్చే కాల్స్, మెసేజ్‌లకు ఎట్టి పరిస్థితులలోను స్పందించవద్దన్నారు. అపరిచిత వ్యక్తులను నమ్మి ఆన్లైన్లో డబ్బులు పంపించడం చేయరాదని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.