News March 31, 2024

తూ.గో.: విహార యాత్రలో విషాదం

image

అల్లూరి జిల్లా చింతూరు డివిజన్ మోతుగూడెం పొల్లూరు జలపాతంలో తూ.గో. జిల్లా వాసి మృతి చెందాడు. వివరాలు ఇలా.. ఆదివారం సెలవు కావడంతో రంగంపేట మండలం సింగంపల్లికి చెందిన కొందరు మోతుగూడెం వద్ద పొల్లూరు జలపాతానికి వెళ్లారు. వారిలో కొండయ్య(33) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు కాలుజారి జలపాతంలో పడిపోయాడు. దీంతో స్నేహితులు హుటాహుటిన బయటకు తీసి మోతుగూడెం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Similar News

News April 20, 2025

రాజమండ్రి: మాజీ ఎంపీ పై మూడవ కేసు నమోదు

image

అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ పై రాజానగరం పోలీసులు శనివారం మరో కేసు నమోదు చేశారు. పాస్టర్ ప్రవీణ్ మృతి ఘటన ప్రాంతంలో కొవ్వొత్తుల ర్యాలీకి పిలుపు ఇవ్వడంపై అప్రమత్తమైన పోలీసులు ఎటువంటి అనుమతి తీసుకోకుండా పాస్టర్ ప్రవీణ్ మృతి చెందిన ఘటన స్థలం వద్ద కొవ్వొత్తులు ర్యాలీ నిర్వహించడంపై కేసు నమోదు పోలీసులు చేశారు. ఇది పాస్టర్ ప్రవీణ్ ఘటనకు సంబంధించి హర్ష కుమార్ పై నమోదైన మూడో కేసుగా పోలీసులు తెలిపారు.

News April 19, 2025

రాజమండ్రి: చంద్రబాబు రాజకీయ ప్రస్థానం స్ఫూర్తిదాయకం

image

సీఎం చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం స్ఫూర్తిదాయకమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆదివారం సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. పదిహేనేళ్లు సీఎంగా, ప్రతిపక్షనేతగా పనిచేయడం రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ రికార్డే అన్నారు. కీ.శే. ఎన్టీఆర్‌ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెబితే వారిలోని ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన నాయకుడు చంద్రబాబు అన్నారు.

News April 19, 2025

పేరుపాలెం బీచ్‌లో గల్లంతైన యువకుడి మృతి

image

పేరుపాలెం బీచ్‌లో స్నానం చేస్తూ ఇద్దరు యువకులు గల్లంతైన విషయం తెలిసిందే. గుడ్ ఫ్రైడే పురస్కరించుకుని నల్లజర్ల మండలం ప్రకాశరావు పాలెంకు చెందిన సంకెళ్ల ఉదయ్ కిరణ్ (20) స్నానానికి వచ్చాడు. అలల ఉద్ధృతికి కొట్టుకుపోయి మృతి చెందాడు. మృతదేహాన్ని నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరో యువకుడు భీమవరం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

error: Content is protected !!