News April 6, 2025
తెనాలి: పోలీసుల అదుపులో రౌడీ షీటర్ లడ్డు

తెనాలి ఐతానగర్ చెందిన రౌడీషీటర్ లడ్డు మరోసారి పోలీసులకు చిక్కాడు. పలు నేరాల్లో భాగంగా ఇటీవల పీడి యాక్ట్ నమోదై జైలుకు వెళ్లి వచ్చిన లడ్డు తాజాగా మరో కేసులో ఇరుక్కున్నాడు. కోపల్లెకి చెందిన మహిళపై దాడి చేసిన ఘటనలో బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి లడ్డును అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ లిఫ్ట్ చేయలేదన్న కారణంతో మహిళపై లడ్డు రాడ్డుతో దాడి చేసినట్లు అభియోగాలు ఉన్నాయి.
Similar News
News April 17, 2025
బాలికపై లైంగిక వేధింపులు.. పోక్సో కేసు

దుగ్గిరాలకి చెందిన రవి ఓ బాలికను లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 14న సాయంత్రం తెనాలి బుర్రిపాలెం రోడ్డులో సైకిల్‌పై వెళ్తున్న బాలికను రవి బెదిరించి, శివారు పొలాలకు తీసుకెళ్లి వేధింపులకు పాల్పడ్డాడు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి రాగా రవి పరారయ్యాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు.
News April 17, 2025
GNT: 2 నెలల్లో రిటైర్‌మెంట్.. గుండెపోటుతో టీచర్ మృతి

పిడుగురాళ్ల (M) బ్రాహ్మణపల్లి ZP స్కూల్ ఇంగ్లిష్ టీచర్ వెంకటరెడ్డి గుంటూరు DEO ఆఫీస్ వద్ద గుండెపోటుతో కుప్పకూలిపోయారు. DEO సి.వి రేణుక సత్వరమే స్పందించడంతో ఉర్దూ DI ఖాశీం, DEO ఆఫీస్ సిబ్బంది హాస్పిటల్‌కి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్థారించారు. తూర్పు MEO ఖుద్దూస్, APTF అధ్యక్షుడు బసవలింగారావు వెంకటరెడ్డికి నివాళులర్పించారు. ఈయన 2 నెలల్లో రిటైర్ కానున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
News April 17, 2025
GNT: బోరుగడ్డ అనిల్‌కు రిమాండ్ పొడిగింపు

ఫిరంగిపురం PSలో నమోదైన కేసులో రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌కు నరసరావుపేట కోర్టు రిమాండ్‌ను ఈ నెల 28 వరకు పొడిగించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్‌లపై సోషల్ మీడియా ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అనిల్‌ను గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అనిల్ రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కోర్టు మరోసారి రిమాండ్ పొడిగించింది.