News April 5, 2025

తెనాలి రైలు ప్రయాణంలో యువకుడి మృతి

image

కోయంబత్తూరు నుంచి ఉత్తరప్రదేశ్‌కు వెళ్తున్న రప్తిసాగర్ ఎక్స్‌ప్రెస్‌లో యువకుడి మృతి చెందాడు. శుక్రవారం బాపట్ల దగ్గర ఆయన కదలకపోవడంతో అనుమానం వచ్చిన తోటి ప్రయాణికులు టీసీకి తెలియజేశారు. సమాచారం మేరకు రైలు తెనాలిలో ఆపి అతన్ని కిందకు దించి వైద్య సాయాన్ని అందించగా అప్పటికే మృతిచెందినట్టు తేలింది. 23-25 ఏళ్ల మధ్య వయసున్న అతడి గుర్తింపు తెలియాల్సి ఉంది. జీఆర్పీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.

Similar News

News April 6, 2025

నిందితులకు శిక్ష పడేలా చూడాలి: GNT ఎస్పీ 

image

న్యాయస్థానాల్లో రౌడీ షీటర్లు, NDPS కేసుల్లో ముద్దాయిలకు త్వరితగతిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో కోర్టు కానిస్టేబుల్‌లతో శనివారం ఎస్పీ సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్‌లకు సంబంధించి వివిధ న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న కేసుల విచారణను వేగవంతం చేసే విధంగా తగిన ప్రణాళికలు రూపొందించాలన్నారు. 

News April 5, 2025

గుంటూరు-గుంతకల్లు రైల్వే లైన్ పనులు వేగవంతం

image

గుంటూరు-గుంతకల్లు మధ్య 2వ రైలు మార్గం పనులు 347కి.మీ పూర్తయ్యాయి. కేంద్ర ప్రభుత్వం 401 కి.మీ మార్గం డబ్లింగ్, విద్యుదీకరణ కోసం రూ.3,631 కోట్లు భరిస్తామని ఐదేళ్ళ క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఆ పనులు ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. పూర్తి స్థాయిలో పనులు పూర్తైతే ఈ మార్గంలో నడిచే రైళ్ళకు గంటన్నర సమయం ఆదా అవుతుందని అంటున్నారు. 

News April 5, 2025

మంగళగిరి: అఘోరీ ఉచ్చు నుంచి బయటపడిన శ్రీవర్షిణి

image

అఘోరీ చేతుల్లో నుంచి మంగళగిరి యువతి శ్రీవర్షిణిని పోలీసులు సురక్షితంగా కాపాడారు. నెల రోజుల క్రితం శ్రీవర్షిణి తల్లిదండ్రుల ఇంటికి వచ్చిన లేడీ అఘోరీ, మాయమాటలతో ఆమెను వశం చేసుకుని గుజరాత్‌కు తీసుకెళ్లింది. కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు మంగళగిరి పోలీసులను ఆశ్రయించారు. కేసు గుజరాత్‌ వరకు వెళ్లింది. అక్కడ అఘోరీని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. శ్రీవర్షిణిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

error: Content is protected !!