News March 12, 2025

తెలంగాణ బడ్జెట్.. జగిత్యాలకు ఏం కావాలంటే..!

image

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో పలు అభివృద్ధి పనులు జరగాలని జిల్లా వాసులు కోరుకుంటున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు టెంపుల్ డెవలప్‌మెంట్, చివరి ఆయకట్టు వరకు పంట పొలాలకు నీళ్లు, తాగునీటి సమస్య, నాణ్యమైన రోడ్లు, ముఖ్యంగా జిల్లాలోని గురుకుల పాఠశాలలో సౌకర్యాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

Similar News

News March 12, 2025

అనకాపల్లి: రాష్ట్ర పండుగగా నూకాంబిక అమ్మవారి జాతర

image

అనకాపల్లి నూకాంబిక అమ్మవారి జాతరకు రాష్ట్ర పండగగా గుర్తింపు లభించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి వినయ్ చంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 28 కొత్త అమావాస్య నుంచి వచ్చేనెల 27వ తేదీ వరకు అమ్మవారి జాతర జరుగుతుంది. ఇటీవల నూకాంబిక జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలని సీఎం చంద్రబాబుకు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.

News March 12, 2025

పెండింగ్‌లో 10వేలకు పైగా పిటిషన్లు: రంగనాథ్

image

TG: అక్రమ కట్టడాలపై హైడ్రాకు పెద్ద ఎత్తున పిటిషన్లు వస్తున్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ఇప్పటికే 10వేలకు పైగా పిటిషన్లు పరిష్కరించకుండా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఒకప్పటి చెరువుల పరిస్థితి, ప్రస్తుత పట్టణీకరణ, హైడ్రా తీసుకుంటున్నచర్యలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రతి సమస్యను లోతుగా అధ్యయనం చేశాకే పరిష్కారానికి కృషిచేస్తున్నామని వెల్లడించారు. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ రాబోతుందని తెలిపారు.

News March 12, 2025

జగిత్యాల: రుణ లక్ష్యాలను సాధించేందుకు బ్యాంకర్లు సహకరించాలి: అదనపు కలెక్టర్

image

రుణ లక్ష్యాలను సాధించేందుకు బ్యాంకర్లు సహకరించాలని అడిషనల్ కలెక్టర్ బీఎస్.లత అన్నారు. జగిత్యాల కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన జిల్లా సమన్వయ కమిటీ (DCC) త్రైమాసిక సమీక్షా సమావేశoలో ఆమె మాట్లాడారు. జిల్లా బ్యాంకింగ్ రంగ ప్రగతిని సమీక్షించడంతోపాటు ప్రాధాన్యత రంగాలకు రుణాలు అందుబాటు, వార్షిక క్రెడిట్ ప్లాన్ అమలు తదితర అంశాలపై చర్చించారు. లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ కుమార్ తదితర అధికారులున్నారు.

error: Content is protected !!