News April 3, 2025

తెలంగాణలో తొలి ట్రాన్స్‌జెండర్ ట్రాఫిక్ మార్షల్స్

image

సైబరాబాద్‌లో జరీనా, విశాలాక్షి, అనూష, ప్రభ, వాసుప్రియ తొలిసారిగా ట్రాన్స్‌జెండర్ ట్రాఫిక్ మార్షల్స్‌గా నియమితులయ్యారు. డీసీపీ సృజన కర్నం ఆధ్వర్యంలో ఎంపిక జరిగిందని, ట్రాన్స్‌జెండర్ హక్కుల కోసం పోరాటం కొనసాగాలని ఆక్టివిస్ట్ చంద్రముఖి మువ్వలా అన్నారు. ప్రభుత్వ శాఖల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు.

Similar News

News April 4, 2025

MIకి గుడ్‌న్యూస్.. త్వరలోనే బుమ్రా ఆగమనం?

image

ముంబై ఇండియన్స్‌ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. వెన్నెముక గాయంతో BGT సిరీస్‌ ఆఖరి మ్యాచ్‌లో ఆయన దూరమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి రికవరీలోనే ఉన్న ఈ పేసర్ తిరిగి ఫిట్‌నెస్ సాధించినట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. మరో రెండు మ్యాచ్‌ల తర్వాత నుంచి ఆయన అందుబాటులోకి రానున్నారని తెలిపాయి. ఈలోపు తుది దశ ఫిట్‌నెస్ టెస్టుల్లో పాల్గొంటారని సమాచారం.

News April 4, 2025

సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తాం: ఎస్పీ 

image

విజయనగరం జిల్లా పోలీసుశాఖలో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం “పోలీసు వెల్ఫేర్ డే” నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరిని తన ఛాంబర్‌లోకి పిలిచి, వారి వ్యక్తిగత, వృత్తిపరమైన, శాఖాపరమైన సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వారి నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు.

News April 4, 2025

బీజేపీ అధ్యక్ష రేసులో లేను: అన్నామలై

image

TN BJP అధ్యక్ష రేసులో తాను లేనని ఆ పార్టీ ప్రస్తుత చీఫ్ అన్నామలై స్పష్టం చేశారు. ‘పార్టీలో ఎంతోమంది గొప్ప నేతలున్నారు. వారి నుంచే నాయకుడిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటాం’ అని పేర్కొన్నారు. ఇక.. వచ్చే ఏడాది ఎన్నికల్లో BJP ఒంటరిగా బరిలోకి దిగాలని అన్నామలై యోచిస్తుండగా ఆ పార్టీ AIADMKతో పొత్తు పెట్టుకోవచ్చన్న ఊహాగానాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన అధ్యక్ష బరినుంచి తప్పుకున్నారన్న చర్చ నడుస్తోంది.

error: Content is protected !!