News March 24, 2025
తొర్రూరు: యాక్సిడెంట్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

సూర్యాపేట(D) బీబీగూడెం శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తొర్రూరు మండలానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఆత్మకూరు(ఎస్) మండలం కోటపహాడ్‌లో శుభకార్యానికి కంటాయపాలెంకు చెందిన గడ్డం రవీందర్ (34), ఆయన భార్య రేణుక (28), కుమార్తె రిషిత(8) వెళ్లారు. తిరిగి HYD వెళ్తుండగా బస్సు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
Similar News
News March 28, 2025
ఓబుళాపురం మైనింగ్ కేసుపై మే 6న తీర్పు

ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం రేపిన ఓబుళాపురం మైనింగ్ కేసు(OMC)లో ఎట్టకేలకు విచారణ ముగిసింది. మే 6న తీర్పు వెల్లడించనున్నట్లు CBI కోర్టు తెలిపింది. ఈ కేసులో నిందితులుగా గాలి జనార్దన్ రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వీడీ రాజగోపాల్ తదితర ప్రముఖులు ఉన్నారు. 219 సాక్షులను విచారించడంతోపాటు 3,337 డాక్యుమెంట్లను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. 2009 నుంచి ఈ కేసు కొనసాగుతోంది.
News March 28, 2025
తెలంగాణ అన్ని మతాల ప్రజల సహా జీవనానికి ప్రతీక: కేటీఆర్

సికింద్రాబాద్ నియోజకవర్గంలోని బౌద్దనగర్ డివిజన్‌లోని వారసిగూడలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కే.టీ.రామారావు, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఇఫ్తార్ విందులు సర్వ మత సౌభ్రాతృత్వాన్ని చాటుతాయని అన్నారు. తెలంగాణ అన్ని మతాల ప్రజల సహా జీవనానికి ప్రతీకని చెప్పారు.
News March 28, 2025
30 బంతుల్లో 31.. కోహ్లీపై ట్రోల్స్

చెన్నైతో మ్యాచులో విరాట్ కోహ్లీ ఇన్నింగ్సుపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. విరాట్ ఓపెనింగ్ వచ్చి 30 బంతుల్లో 31 రన్స్ చేసి ఔటయ్యారు. టీ20లో టెస్ట్ ఇన్నింగ్స్ ఆడారని ఎద్దేవా చేస్తున్నారు. చాలా షాట్లు కనెక్ట్ చేయలేకపోయారని పోస్టులు చేస్తున్నారు. పిచ్ కఠినంగా ఉందని, అక్కడ వేగంగా ఆడటం కష్టమని కోహ్లీ ఫ్యాన్స్ రిప్లైలు ఇస్తున్నారు. మరి ఇవాళ్టి కోహ్లీ ఇన్నింగ్సుపై మీ కామెంట్?