News March 24, 2025
తొర్రూరు: యాక్సిడెంట్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

సూర్యాపేట(D) బీబీగూడెం శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తొర్రూరు మండలానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఆత్మకూరు(ఎస్) మండలం కోటపహాడ్‌లో శుభకార్యానికి కంటాయపాలెంకు చెందిన గడ్డం రవీందర్ (34), ఆయన భార్య రేణుక (28), కుమార్తె రిషిత(8) వెళ్లారు. తిరిగి HYD వెళ్తుండగా బస్సు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
Similar News
News March 30, 2025
గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల

TG: ఇటీవల గ్రూప్-1 మెయిన్స్ ప్రొవిజనల్ మార్కులను విడుదల చేసిన టీజీపీఎస్సీ ఇవాళ జనరల్ ర్యాంకింగ్ జాబితాను రిలీజ్ చేసింది. https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్‌లో లిస్టును అప్‌లోడ్ చేసింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 563 పోస్టుల భర్తీకి గత ఏడాది అక్టోబరు 21 నుంచి 27 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
News March 30, 2025
జైలులో మహిళా ఖైదీ సూసైడ్

ఏలూరు జిల్లా జైల్లో రిమాండ్‌లో ఉన్న శాంతికుమారి అనే మహిళా ఖైదీ బ్యారక్‌లో చున్నితో ఆత్మహత్య చేసుకుంది. ఆమెను చూసిన జైలు సిబ్బంది ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. శాంతి కుమారిది జీలుగుమిల్లి మండలం తాటాకులగూడెం. ప్రియుడితో కలసి భర్తను హత్య చేసిన ఆరోపణలతో ఈనెల 24న అరెస్ట్ చేశారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 30, 2025
BHPL: కొత్త సంవత్సరం.. స్థానిక సమరం!

స్థానిక సంస్థల ఎన్నికల ఆశావహులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రాజకీయ భవిష్యత్‌ను తేల్చనుంది. భూపాలపల్లి జిల్లాలో త్వరలో జరిగే సర్పంచ్, వార్డ్ మెంబర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఈ నూతన సంవత్సరంలో జరగనున్నాయి. వీటితో పాటు ఈ ఏడాది భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ఉన్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన రాజకీయ ఆశావహులకు ఈ ఏడాది ‘కీ’ రోల్ కాబోతోంది.