News June 24, 2024

తొలి కేబినెట్ భేటీలో కొల్లు రవీంద్ర, పార్థసారథి

image

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన తొలి మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకునేందుకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేయనున్నారు. తొలి మంత్రి వర్గ సమావేశం కావటంతో వివిధ వర్గాలకు లబ్ధి చేకూరేలా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News

News October 6, 2024

నేడు మచిలీపట్నంలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

image

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుహాస్ హీరోగా నటించిన ‘జనక అయితే గనక’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు మచిలీపట్నం నోబుల్ కాలేజ్‌లో జరగనుంది. సాయంత్రం 5 గంటలకు నోబుల్ కాలేజ్ గ్రౌండ్స్‌లో ప్రారంభమయ్యే ఈ ఈవెంట్‌కు హీరో హీరోయిన్ సుహాస్, సంగీర్తనతోపాటు ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజ్, చిత్ర యూనిట్ మొత్తం తరలి రానుంది. కాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విస్తృత ఏర్పాట్లు చేశారు.

News October 6, 2024

ప్రజలపై టికెట్ రేట్ల భారం మోపము: ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల

image

ఆర్టీసీ ఛైర్మన్‌గా కొనకళ్ళ నారాయణరావు విజయవాడ ఆర్టీసీ హౌస్‌లో అధికారుల సమక్షంలో శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలను సురక్షితంగా, సౌలభ్యంగా గమ్యాలకు చేర్చే సాధనం ఏపీఎస్ఆర్టీసీ అన్నారు. ఆర్టీసీకి నష్టం వచ్చినా, ప్రజలపై టికెట్ భారం వేయకుండా ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. పేదవారికి, మధ్య తరగతి వారికి ఆర్టీసీని అందుబాటులో ఉంచుతామన్నారు.

News October 6, 2024

విజయవాడ: దుర్గమ్మ రేపు ఏ అవతారంలో దర్శనమిస్తారంటే?

image

శరన్నవరాత్రులలో భాగంగా దుర్గమ్మ రేపు ఆదివారం నాలుగో రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీ లలితా దేవి తనను కొలిచిన భక్తుల దారిద్ర దుఃఖాలు నశింపచేస్తుందని పండితులు తెలిపారు. చెరకుగడ, విల్లు, పాశము, అంకుశము ధరించిన అమ్మవారు భక్తుల ఇక్కట్లు తొలగించి, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందన్నారు.