News March 21, 2025
తొలి రోజు ప్రశాంతంగా ముగిసిన పది పరీక్షలు

జిల్లాలో మొదటిరోజు పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు డీఈఓ సత్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 8,627 మంది విద్యార్థులకు గాను మొదటి రోజు 8,616 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. 11 మంది గైర్హాజరయ్యారన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని పరీక్ష కేంద్రాలలో అన్ని మౌలిక వసతులు ఏర్పాట్లు చేశామన్నారు. విద్యార్థులు ఎలాంటి భయం లేకుండా పరీక్షలు రాయాలని సూచించారు.
Similar News
News March 24, 2025
అరటి రైతులకు రూ.1.10 లక్షలు: అచ్చెన్న

AP: వడగండ్ల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. అనంతపురం, సత్యసాయి, కడప, ప్రకాశం జిల్లాల్లో అధికారులు ఎన్యూమరేషన్ చేస్తున్నారని చెప్పారు. త్వరలోనే మిగిలిన జిల్లాల్లో ప్రక్రియ మొదలవుతుందన్నారు. అరటి రైతులకు హెక్టారుకు రూ.35,000 ఇన్‌పుట్ సబ్సిడీ, మొక్కలు నాటుకునేందుకు అదనంగా మరో రూ.75వేలు అందజేస్తామని ప్రకటించారు. మొత్తంగా రూ.1.10 లక్షలు సాయం చేస్తామన్నారు.
News March 24, 2025
నాగార్జునసాగర్ నేటి సమాచారం

నాగార్జునసాగర్ ప్రాజెక్టు సమాచారాన్ని అధికారులు సోమవారం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగుల కాగా ప్రస్తుతం 520.60 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 150.3730 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. సాగర్‌కు ఇన్ ఫ్లో 23183 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 14711 క్యూసెక్కులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
News March 24, 2025
నల్గొండ కలెక్టరేట్ ప్రజావాణికి 100 దరఖాస్తులు

ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సోమవారం సుమారు 100 మంది సమస్యల పరిష్కారం నిమిత్తం దరఖాస్తులు సమర్పించారు. ఈ దరఖాస్తులలో ఏప్పటిలాగే వ్యక్తిగత సమస్యలు, భూ సమస్యలు, పెన్షన్ మంజూరి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై వచ్చాయి.